పుష్ప 2 విషయంలో నిరాశలో అభిమానులు… ఆ కోరిక తీరనట్టేనా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun ) అభిమానులు పుష్ప2( Pushpa 2 ) సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమా డిసెంబర్ ఐదవ తేదీని ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్లు కూడా త్వరలోనే ప్రారంభం కాబోతున్నాయి.

ఇటీవల మేకర్ నేషనల్ ప్రెస్ మీట్ నిర్వహించిన సంగతి తెలిసిందే.ఈ కార్యక్రమంలో భాగంగా రెండు సినిమా ఈవెంట్లను నిర్వహించబోతున్నట్లు తెలిపారు.

అయితే తాజాగా ఈ వేడుకలకు బ్రేక్ పడిందనే చెప్పాలి.హైదరాబాద్లో నేటి నుంచి నెలరోజుల పాటు అనగా నవంబర్ 28వ తేదీ వరకు 144 సెక్షన్ అమలులో ఉన్నట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు.

"""/" / ఈ విధంగా తెలంగాణలో 144 సెక్షన్ అమలులో ఉంది అంటే ఎలాంటి బహిరంగ సభలు రాస్తారోకోలు ధర్నాలు చేయకూడదు.

అలాగే ప్రజలు ఎక్కడ గూమికూడి ఉండకూడదు.ఇలా ఐదు మందికి మించి ఒకచోట ఉంటే చర్యలు తప్పవని అధికారులు తెలిపారు.

ఈ తరుణంలోనే సినిమా వేడుకలకు కూడా పోలీస్ అధికారుల నుంచి ఎలాంటి అనుమతి లభించదని తెలుస్తుంది.

దీంతో పుష్ప 2 సినిమా ప్రీ రిలీజ్ ( Pre Release ) వేడుక ఉండదని అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

"""/" / ఇక నవంబర్ 28వ తర్వాత సినిమా వేడుకను నిర్వహించడానికి పోలీసుల నుంచి అనుమతి వస్తే నిర్వహిస్తారు  అయితే పోలీసులు ఓపెన్ గ్రౌండ్లో వేడుక చేయడానికి అనుమతి ఇస్తారా లేకపోతే దేవర సినిమా లాగా చేస్తారా అనే ఆందోళనలో అభిమానులు ఉన్నారు.

ఇక ఏపీలో ఈ సినిమా వేడుకను నిర్వహించడానికి ఇక్కడ ప్రభుత్వం కూడా అనుమతి తెలుపుతుందా లేదా అనేది తెలియదు ఎందుకంటే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నికల ప్రచార సమయంలో అల్లు అర్జున్ తన స్నేహితుడి కోసం నంద్యాల వెళ్లారు.

తద్వారా ఈ సినిమా వేడుకలకు ఏపీలో అనుమతులు లభిస్తుందా లేదా అనే చర్చలు కూడా జరుగుతున్నాయి.

వింటర్ లో పొడి జుట్టును రిపేర్ చేసే బెస్ట్ అండ్ న్యాచురల్ హెయిర్ క్రీమ్ మీ కోసం!