పుష్ప 2 పై భారీ హైప్ పెంచేసిన అనసూయ... ప్రతి పది నిమిషాలకు ఓ ట్విస్ట్ అంటూ?

అల్లు అర్జున్ ( Allu Arjun ) నటించిన తాజా చిత్రం పుష్ప 2( Pushpa 2 ) .ఈ సినిమా డిసెంబర్ 6న విడుదలకు సిద్ధం అయ్యింది.

 Anasuya Interesting Comments On Pushpa 2 Movie, Anasuya,bigg Boss,pushpa 2,allu-TeluguStop.com

అయితే ఈ సినిమా అనుకున్న దానికన్నా ఒకరోజు ముందుగానే విడుదలకు సిద్ధం అయ్యింది.ఈ సినిమా డిసెంబర్ 5వ తేది పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి ఎన్నో విషయాలు వైరల్ అవుతున్నాయి.

ఇకపోతే తాజాగా యాంకర్ అనసూయ ( Anasuya ) కూడా ఈ సినిమాకు సంబంధించి కీలక విషయాలను వెల్లడించారు ఈ సినిమాలో అనసూయ ద్రాక్షాయిని పాత్రలో నటించబోతున్న సంగతి తెలిసిందే.

Telugu Allu Arjun, Anasuya, Anasuya Pushpa, Bigg Boss, Pushpa-Movie

మొదటి భాగంలో ఈమె పాత్రకు అనుకున్న స్థాయిలో ప్రాధాన్యత లేకపోయినా రెండు భాగంలో మాత్రం అనసూయ పాత్రకు మంచి ప్రాధాన్యత ఉందని తెలుస్తోంది.తాజాగా అనసూయ బిగ్ బాస్ ( Bigg Boss ) వేదికపై సందడి చేశారు.ఈ కార్యక్రమంలో భాగంగా పుష్ప2 సినిమా గురించి నాగార్జున ప్రశ్నించారు.

మంగళం శీనుని చంపేస్తానని బెదిరిస్తున్నావంట అంటూ నాగార్జున సరదాగా అనసూయ ఆటపట్టించారు.అలాగే సినిమా విశేషాలను అడిగి తెలుసుకున్నారు.

Telugu Allu Arjun, Anasuya, Anasuya Pushpa, Bigg Boss, Pushpa-Movie

ఇక ఈ వేదికపై అనసూయ పుష్ప 2 సినిమా గురించి మాట్లాడుతూ పలు విషయాలు వెల్లడించారు.పుష్ప సినిమా పాన్ ఇండియా స్థాయిలో మంచి ఆదరణ సొంతం చేసుకుంది.అయితే ఇది కేవలం ఇంట్రడక్షన్ సినిమా మాత్రమే అని తెలిపారు.అసలు కథ మొత్తం పుష్ప 2 సినిమాలో ఉందని అనసూయ అసలు విషయం తెలిపారు.ఇక ఈ సినిమాలో ప్రతి పది నిమిషాలకు ఒక ట్విస్ట్ ఉంటుందని ప్రతి సన్నివేశం క్లైమాక్స్ సీన్ లాగా ఉంటుందని ఆ తర్వాత మరో ట్విస్ట్ వస్తుందని అనసూయ తెలిపారు.పుష్ప సీక్వెల్ సినిమా గురించి అనసూయ ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచేసాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube