ఇటీవల కాలంలో వేల కోట్లలో సినిమా ఇండస్ట్రీ బిజినెస్ జరుగుతోంది.ప్రభాస్( Prabhas ) లాంటి పడా హీరోని మాత్రమే కాకుండా మీడియం రేంజ్ హీరోలు కూడా బాక్సాఫీస్ వద్ద వందల కోట్లు కొల్లగొడుతున్నారు.
ఆ సినిమాల గ్రాస్ కలెక్షన్లు చూస్తే ఆశ్చర్యపోక తప్పదు.ఈ కలెక్షన్స్ అన్ని చూసి నిర్మాత బాగా లాభపడి ఉంటారని ప్రేక్షకులు అనుకోవడం సహజం.
కానీ చాలామందికి గ్రాస్, షేర్, నెట్ అమౌంట్ గురించి అవగాహన ఉండదు.అందువల్ల లాభాలు వస్తాయా రాదా అనేది వారికి తెలియదు.
అయితే రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న దిల్ రాజు గ్రాస్, షేర్, నెట్ పదాలకు అర్ధాలేంటో ఒక ప్రొడ్యూసర్ నెట్ అమౌంట్ ఎంత సంపాదిస్తారో చెప్పాడు.
దిల్ రాజు( Dil Raju ) మాట్లాడుతూ “ఉదాహరణకి ఒక బడా సినిమా తెలుగు స్టేట్స్‌లో రూ.200 కోట్లు కలెక్ట్ చేస్తుందని అనుకున్నాం.ఆ రూ.200 కోట్లలో 18 శాతం ప్రభుత్వానికి జీఎస్టీ రూపంలో వెళ్ళిపోతుంది.అంటే రూ.36 కోట్లు కట్ అవుతాయి.తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల రెంటల్ కి డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది.
అవి గ్రాస్ కలెక్షన్స్‌లో 25% పోతాయి.అంటే 50 కోట్లు థియేటర్ల రెంటులకు మిగతా ఖర్చులకు ఇవ్వాల్సి వస్తుంది.మొత్తంగా రూ.86 కోట్లు ఇక్కడే పోతాయి మిగతా రూ.114 కోట్లలో డిస్ట్రిబ్యూటర్లకు షేర్ ఇవ్వాలి.ఒక పర్సంటేజ్ కుదుర్చుకుంటారు అందులో 20 శాతం దాకా మనీ ఇవ్వాల్సి ఉంటుంది అలా చూసుకుంటే 25 కోట్లు వారికే వెళ్లిపోతాయి అప్పుడు రూ.85-90 కోట్ల మధ్యలో నిర్మాతకు నెట్ మిగులుతుంది” చెప్పాడు.తమిళనాడు వంటి స్టేట్స్ థియేటర్ల రెంటల్ కి బదులుగా పర్సంటేజీ ఉంటుందని ఆయన తెలిపారు.
అయితే గ్రాస్ కలెక్షన్లలో నిర్మాతలకు సగం మాత్రమే మిగులుతుందని తెలుసుకొని చాలామంది ఆశ్చర్యపోతున్నారు.</br
సినిమా వ్యాపారంలో వసూళ్లను లెక్కించేటప్పుడు గ్రాస్, నెట్, షేర్ వాడే మూడు ముఖ్యమైన పదాలను చాలా బాగా వివరించారు దిల్ రాజు.ఇవి కొంచెం గందరగోళంగా అనిపించినా, దిల్ రాజు వివరణతో వీటి గురించి అందరికీ ఒక అవగాహన వచ్చింది.దిల్ రాజు చెప్పిన వివరాలే కాకుండా మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
గ్రాస్ అంటే సినిమా థియేటర్లలో టిక్కెట్లు అమ్ముడైన మొత్తం డబ్బు.అంటే, ప్రేక్షకులు సినిమా చూడటానికి చెల్లించిన మొత్తం డబ్బు.
ఇది సినిమా వసూళ్లలో మొదటి లెక్క.నెట్ అంటే గ్రాస్‌లో నుంచి ప్రభుత్వ వినోద పన్ను తీసివేసిన తర్వాత మిగిలే డబ్బు.
అంటే, ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్ను తీసివేసిన తర్వాత నిర్మాతకు, నిర్మాణ సంస్థకు మిగిలే డబ్బు.షేర్ అంటే సినిమా వసూళ్లలో నిర్మాత, నిర్మాణ సంస్థ, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ (థియేటర్ యజమాని) వంటి వారికి వచ్చే వాటా.
అంటే, మొత్తం వసూళ్లను వీరంతా తమ వాటా ప్రకారం పంచుకుంటారు.