తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్లను వాళ్ళు స్టార్ హీరోలుగా ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు.ఇప్పటికే యంగ్ హీరోలు పాన్ ఇండియా బాట పడుతున్న నేపధ్యం లో స్టార్ హీరోలు మరింత ముమ్మరం చేస్తూ భారీ సక్సెస్ లను సాధిస్తూ వేల కోట్లలో కలెక్షన్స్ ను రాబట్టడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు.
ఇక ఇప్పటికే ప్రభాస్ లాంటి స్టార్ హీరో తనదైన రీతిలో ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే.అయితే ప్రభాస్( Prabhas ) బాహుబలి సినిమాతో పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ ని సాధించాడు.
అప్పటినుంచి ఇప్పటివరకు చేస్తున్న ప్రతి సినిమా కూడా పాన్ ఇండియాలో ఎంతో కొంత ఇంపాక్ట్ చూపిస్తూ వస్తున్నాయి.

ఇక సలార్, కల్కి లాంటి సినిమాలు మాత్రం భారీ సక్సెస్ లను సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ ని కూడా క్రియేట్ చేసి పెట్టాయి.ఇక ఇప్పుడు ప్రభాస్ మంచు విష్ణు హీరోగా వస్తున్న ‘కన్నప్ప ( Kannappa )’ సినిమాలో నంది గెటప్ లో కనిపించబోతున్నట్టుగా తెలుస్తుంది.ఇక మొత్తానికైతే కన్నప్ప సినిమా భారం మొత్తాన్ని ప్రభాస్ పైనే పెట్టినట్టుగా తెలుస్తోంది.
మరి తను ఈ సినిమాలో ఒక ఐదు నిమిషాల పాటు కనిపించే పాత్రలో నటించాడట.మరి ఎలాగైనా సరే ఈ సినిమాని సూపర్ సక్సెస్ చేయాలనే ఉద్దేశ్యం తో మంచు విష్ణు భారీ ప్రణాళికలను రూపొందిస్తున్నాడు.
ఇక ఈ సినిమాలో శివుడిగా అక్షయ్ కుమార్ నటించాడు.దానివల్ల ఆయనకు బాలీవుడ్ లో కూడా భారీగా మార్కెట్ అయితే క్రియేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.ఇక ఏది ఏమైనా కూడా కన్నప్ప సినిమా ఎలా ఉండబోతుంది అనే దానిమీద ప్రతి ఒక్కరిలో ఆసక్తి అయితే కలుగుతుంది.

ఇక రీసెంట్ గా ఈ సినిమా యూనిట్ అన్ని ప్రాంతాలు తిరుగుతూ దేవాలయాలను దర్శించుకుంటున్నట్టుగా తెలుస్తుంది.ఇక తొందర్లోనే ఈ సినిమాని రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది.అయితే ఇంతకుముందు వచ్చిన టీజర్ ప్రేక్షకుల్ని ఏమాత్రం ఇంప్రెస్ చేయకపోగా చాలావరకు ట్రోలింగ్స్ ను కూడా ఎదుర్కొంది.
మరి ఇక మీద రాబోయే ట్రైలర్ తో ఆయన భారీ ప్రణాళికలను రూపొందిస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది…
.







