నందమూరి నటసింహం బాలకృష్ణ ( Balakrishna ) ప్రస్తుతం కెరియర్ పరంగా అలాగే రాజకీయాల పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.ఇక ఈయన హిందూపురం నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
ఇలా రాజకీయాలు సినిమాలు మాత్రమే కాకుండా ఈయన అన్ స్టాపబుల్ అనే కార్యక్రమాన్ని కూడా ఎంతో విజయవంతం చేసిన సంగతి తెలిసిందే.ఇలా కెరియర్ పై ఎంతో ఫోకస్ చేసిన బాలకృష్ణ త్వరలోనే మరో కొత్త బిజినెస్ ప్రారంభించబోతున్నారని తెలుస్తుంది.
సినిమా ఇండస్ట్రీ చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఎన్నో స్టూడియోలు నిర్మాణం అయ్యాయి.రామానాయుడు స్టూడియో, అన్నపూర్ణ స్టూడియో, రామకృష్ణ స్టూడియో ,సారథి స్టూడియో, అల్లు రామలింగయ్య స్టూడియో వంటి ఎన్నో స్టూడియోలో నిర్మాణం అయ్యాయి.ఇక ఈ స్టూడియోల నిర్మాణానికి అప్పటి ప్రభుత్వాలు ఎంతో సహకరించాయి.ఇదిలా ఉంటే నందమూరి బాలకృష్ణ సినిమా స్టూడియో ( Cini Studio ) ను నిర్మించాలని ఎన్నో రోజులుగా వెయిట్ చేస్తున్న విషయం తెలిసిందే.
ఈయన గత ఐదు సంవత్సరాలలో ఈ స్టూడియో నిర్మాణం చేపట్టాలని చూడగా అప్పటికే ప్రభుత్వం మొండి వైఖరితో బాలకృష్ణ వెనుకడుగు వేయాల్సి వచ్చింది.కానీ ఇప్పుడు తెలంగాణలో ఈయన స్టూడియో ఏర్పాటు చేయాలని ఆలోచనలో ఉన్నారు.అయితే బాలయ్య ఆలోచనకు తెలంగాణ సర్కార్ కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తుంది.రేవంత్ రెడ్డి( Revanth Reddy ) సర్కారు బాలకృష్ణ కోసం ఏకంగా 500 ఎకరాల భూమిని కేటాయిస్తున్నట్లు సమాచారం అందుతుంది.
ఇప్పటికే ఈ భూమికి కేటాయింపుల ప్రతిపాదన కు రెవెన్యూ శాఖ ఆమోదముద్ర వేసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కి పంపినట్లు తెలుస్తోంది.