సాధారణంగా చెప్పాలంటే చాలామంది ముఖం మీద మచ్చలతో బాధపడుతూ ఉంటారు.బయటకు రావాలన్న నలుగురిలో తిరగాలన్న చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు.
ఇటువంటివారు ఇంటిలో దొరికే కొన్ని పదార్థాలతో ఆ మచ్చలకు చెక్ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు.తేనె( honey ) ను ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు.
మరి అలాంటి తేనెతో అందాన్ని ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.పసుపు తేనె కలిపి రాయడం వల్ల చర్మం కాంతివంతంగా ఉంటుంది.
పసుపులో ఉండే కర్కమిన్ ( Curcumin )చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది.తేనే ఫేస్ నీ మృదువుగా మారుస్తుంది.

రెండు టేబుల్ స్పూన్ల తేనెకి, అర టీ స్పూన్ పసుపు( teaspoon turmeric ) వేసి బాగా కలపాలి.దీనిని ఫేస్ పై అప్లై చేసి 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి.పెరుగు, తేనె మిశ్రమాన్ని కలిపి ముఖానికి రాయడం వల్ల చర్మం యవ్వనంగా, మృదువుగా మారుతుంది.పెరుగు వాడడం వల్ల చర్మానికి మాయిశ్చరైజింగ్ ఫీలింగ్ వస్తుంది.చర్మం కాంతివంతంగా కూడా మారుతుంది.రెండు టేబుల్ స్పూన్ల పెరుగుకి ఒక టేబుల్ స్పూన్ తేనే తీసుకుని వీటిని బాగా కలపాలి.
ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి.బాగా ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

ముఖ్యంగా చెప్పాలంటే చర్మానికి జోజోబా ఆయిల్( Jojoba oil ) చాలా మంచిది.ఈ నూనెలో విటమిన్ ఈ, సీ లు ఎక్కువగా ఉంటాయి.నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ కి ఒక టేబుల్ స్పూన్ తేనె పోసి బాగా కలపాలి.దీన్ని ముఖానికి అప్లై చేసి బాగా మసాజ్ చేయాలి.20 నిమిషాల తర్వాత ఉంచి గోరువెచ్చటి నీటితో ఫేస్ క్లీన్ చేసుకోవాలి.ఇలా చేసుకోవడం వల్ల స్కిన్ అద్భుతంగా మెరిసిపోతుంది.
ఇలా చేయడం ద్వారా ముఖానికి మంచి మెరుపు వస్తుంది.ఇలాంటి సింపుల్ టిప్స్ ని ఇంట్లో పాటించి చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు.