టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిస్థాయిలో శాఖల పనితీరుపైన టిడిపి అధినేత ఏపీ సీఎం చంద్రబాబు( CM Chandrababu ) సమీక్షలు నిర్వహిస్తూ, అన్ని శాఖలలోనూ ప్రక్షాళన మొదలుపెట్టారు.పూర్తిస్థాయిలో ప్రజామోదిత పాలన అందించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు.
దీనిలో భాగంగానే శాఖల వారీగా సమీక్షలు నిర్వహిస్తూ పారదర్శకతను పెంచే ప్రయత్నం చేస్తున్నారు.దీనిలో భాగంగానే ఈరోజు రెండు శాఖల పైన ప్రత్యేక్షంగా సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు.
ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ఏపీ సచివాలయానికి చేరుకోనున్న చంద్రబాబు ముందుగా ఆర్థిక శాఖపై( Ministry Of Finance ) సమీక్ష నిర్వహిస్తారు.

ఆ తరువాత సాయంత్రం నాలుగు గంటలకు సోషల్ వెల్ఫేర్( Social Welfare ) శాఖ పైన సమీక్ష నిర్వహించబోతున్నారు.ఆర్థిక శాఖ పై సీఎం చంద్రబాబు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టమన్నారు. ఈ మేరకు మరోసారి సమీక్షకు సిద్ధమవుతున్నారు.
ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై అధికారులతో చర్చించనున్నారు.రాష్ట్రానికి ఉన్న అప్పులు, ఆదాయం , ఖర్చులు, వంటి వాటిపై పూర్తిస్థాయిలో ఆరా తీయనున్నారు.
అలాగే పెండింగ్ బిల్లులు ఎంత మొత్తంలో ఉన్నాయి అనే అంశం పైన కూడా ఈ సమావేశంలో అధికారులతో చంద్రబాబు చర్చించనున్నారు. రాష్ట్రానికి వస్తున్న ఆదాయాలు, కేంద్రం నుంచి రావాల్సిన నిధుల పైన ప్రత్యేకంగా దృష్టి సారించారు.

ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు సోషల్ వెల్ఫేర్ శాఖపై సమీక్ష నిర్వహించి, ఈ రెండు శాఖల పైన పూర్తిస్థాయిలో అవగాహన తెచ్చుకుని దానికి అనుగుణగా కీలక నిర్ణయాలు తీసుకునే విధంగా చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు.టిడిపి కూటమి ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని ప్రధాన హామీలను అమలు చేసేందుకు కసరత్తు చేస్తూనే ఆర్థికంగా వాటికి సంబంధించి నిధుల సమీకరణ పైన చంద్రబాబు దృష్టి సారించారు.దీనిలో భాగంగానే ఆర్థిక శాఖ విషయంలో ప్రత్యేకంగా దృష్టి సారించారు.ఈరోజు సమీక్ష లో పూర్తి స్థాయిలో ఆదాయం, అప్పులు, రావలసిన నిధులు వంటి వాటిపై సమీక్ష నిర్వహించి , దానికి అనుగుణంగా పథకాల అమలుకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు.