ఇండియన్ ఫుడ్‌ని "డర్టీ" అన్న చైనీస్ మహిళ.. యూట్యూబర్ ఏం చేశాడంటే..?

ఇటీవల ఇండియన్ యూట్యూబర్ పరమ్‌వీర్( YouTuber Paramveer ) ఓ చైనీస్ మహిళను కలిశాడు.ఆమె భారతీయ ఆహారాన్ని డర్టీ అని చాలా బాగా విమర్శించింది.

 The Chinese Woman Called Indian Food Dirty What Did The Youtuber Do Indian You-TeluguStop.com

ఆమె అంత మాట అనేసినా పరమ్‌వీర్ కోప్పడలేదు చాలా ఖాంగా ప్రశాంతంగా ఆమెకు సమాధానం చెప్పాడు.అందుకే ఇప్పుడు ఈ యూట్యూబర్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

వీరిద్దరి సంభాషణకు సంబంధించిన ఒక వీడియో వైరల్ అయ్యింది.అందులో ఆయన ఆ మహిళతో భారతీయ స్ట్రీట్ ఫుడ్ ఎంత హైజీన్‌గా ఉంటుందనే అంశంపై చర్చించారు.

ఆ మహిళ కొన్ని షాకింగ్ వీడియోలు చూపించగా, పరమ్‌వీర్ ఆ వీడియోలను చూసి నవ్వుతూ, ఇలాంటి అనారోగ్యకరమైన పద్ధతులు భారతీయ స్ట్రీట్ ఫుడ్‌(Street food )లో అరుదు అని ఆమెకు హామీ ఇచ్చాడు.ఆమె ఫోన్‌లో ఉన్న వీడియోల్లో, ఒక వ్యాపారి తన పాదాలతో పిండిని తొక్కుతున్నట్లు మరికొంతమంది చంకల్లో చేతులు పెట్టుకొని ఆ చేతులతోనే పిండిని పట్టుకుని పిసుకుతున్నట్లు కనిపించింది.

పరమ్‌వీర్ “నన్ను నమ్మండి, ఇలాంటివి రోడ్ల మీద మీకు ఎక్కడా కనిపించవు.వీళ్లు ఈ వీడియోలు ఎక్కడ దొరుకుతాయో నాకు తెలీదు… మీరు శుభ్రమైన చోటుకు వెళితే, మీకు ఆహారం చాలా ఇష్టం నచ్చుతుంది” అని అన్నాడు.

చైనీస్ మహిళ( Chinese woman ) అభిప్రాయాన్ని మార్చాలని ఆ యూట్యూబర్‌ నిర్ణయించుకున్నాడు.అందుకని, ఆమెకు భారతీయ ఆహారం ఎంత రుచికరంగా ఉంటుందో చూపించాలని అనుకున్నారు.ఆయన ఆమెను స్థానిక రెస్టారెంట్‌కు తీసుకెళ్లి, దాల్ మఖ్ని, షాహీ పనీర్, నాన్ లాంటి అద్భుతమైన భారతీయ ఆహారం తినిపించాడు.ఆహారం తింటున్నప్పుడు ఆ మహిళకు ఏమాత్రం అనుమానం లేకుండా, “రుచిగా ఉంది” అని చెప్పింది.

ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లో “ఒక చైనీస్ మహిళ ఒక భారతీయ వ్లాగర్‌ను ఇబ్బంది పెట్టాలని అనుకుని అనారోగ్యకరమైన స్ట్రీట్ ఫుడ్ వీడియోలు చూపించింది.కానీ ఆ దయగల వ్లాగర్‌ ఆమెను మంచి ఇండియన్ రెస్టారెంట్‌( Indian Restaurant )కు తీసుకెళ్లి అద్భుతమైన భారతీయ ఆహారం తినిపించాడు.” అని క్యాప్షన్‌తో ఓ వీడియో పోస్ట్ చేశారు.

ఈ సంఘటన చాలా మందిని ఆకట్టుకుంది.ఆ యూట్యూబర్‌ ఫ్రెండ్లీ రెస్పాన్స్‌ను ప్రేక్షకులు మెచ్చుకున్నారు.“ఆమె చూపించిన వీడియోలకు ఆయన నవ్వారు, ఎందుకంటే ఆమెకు సరైన సమాచారం తెలియదు కాబట్టి.ఆయన ఆమెను రెస్టారెంట్‌కు తీసుకెళ్లి భారతీయ ఆహారం తినిపించారు.ఇది ఇద్దరికీ ఓ మంచి అనుభవం” అని ఒక యూజర్ కామెంట్ చేశాడు.మరొకరు, “భారతదేశానికి మంచి పబ్లిసిటీ కావాలి! కొన్ని వీడియోల ఆధారంగా భారతీయ ఆహారం మొత్తాన్ని తప్పుగా అంచనా వేయడం చాలా బాధాకరం.ఆ యూట్యూబర్‌ ఆమెకు నిజమైన భారతీయ ఆహారాన్ని పరిచయం చేసినందుకు నేను సంతోషిస్తున్నాను” అని కామెంట్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube