దేశంలో నానాటికీ పెరిగిపోతున్న విదేశీ వలసలకు( Immigrants ) అడ్డుకట్ట వేసే క్రమంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో( Canada PM Justin Trudeau ) తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.2025 నాటికి కెనడాలో( Canada ) శాశ్వత నివాస హోదా అందుకునే విదేశీయుల సంఖ్యను పరిమితం చేయాలని ట్రూడో భావిస్తున్నారు.గృహ సంక్షోభం, నిరుద్యోగం, వలసలను కట్టడి చేసేందుకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
అయితే సగటు కెనడా పౌరుడి ఆలోచనకు తగినట్లుగానే జస్టిన్ ట్రూడో ఈ నిర్ణయం తీసుకున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి .ఎన్విరానిక్స్ ఇన్‌స్టిట్యూషన్( Environics Institute ) చేసిన కొత్త అధ్యయనం ప్రకారం వలసలకు వ్యతిరేకంగా మెజారిటీ కనడియన్లు ఏకమవుతున్నట్లు ఆసియన్ పసిఫిక్ పోస్ట్ ఆదివారం ఈ మేరకు కథనాన్ని నివేదించింది.కెనడియన్ల భవిష్యత్తును ప్రతిబింబించే సమస్యలపై లోతైన ప్రజాభిప్రాయాన్ని , సామాజిక పరిశోధనను నిర్వహించడానికి 2006లో మైఖేల్ ఆడమ్స్ ‘‘ ఎన్విరానిక్స్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ సర్వే రీసెర్చ్’’ను స్థాపించారు.
ఎన్విరానిక్స్ సర్వే ప్రకారం దేశంలోని ప్రతి పది మందిలో ఆరుగురు కెనడియన్లు తమ ప్రభుత్వం వలసలను ఎక్కువగా అనుమతిస్తోందని నమ్ముతున్నారు.శరణార్ధులుగా దేశంలోకి వస్తున్న వారు నిజమైన శరణార్ధులు కాదని కెనడియన్లు చెబుతున్నారు.వలసదారులు కెనడియన్ల విలువలను అనుసరించడం లేదని నివేదిక పేర్కొంది.1998 నుంచి దేశంలో వలసదారుల సంఖ్య పెరిగిందని కెనడియన్లు అభిప్రాయపడుతున్నారు.
కన్జర్వేటివ్ పార్టీ( Conservative Party ) మద్ధతుదారులు వలసలను అంగీకరిస్తుండగా.లిబరల్స్ 45 శాతం, ఎన్డీపీ 36 శాతం మేర ఓకే చెబుతున్నారు.కెనడియన్ ఆర్ధిక వ్యవస్ధపై ఇమ్మిగ్రేషన్ అనేది సానుకూల ప్రభావాన్ని చూపుతుందని ప్రతి 10 మందిలో ఏడుగురు అంగీకరించినప్పటికీ, ఇది వరుసగా రెండో ఏడాది క్షీణించింది.2023 నుంచి ప్రధాన ప్రావిన్స్‌లలో 18 నుంచి 29 ఏళ్ల వయసు గల యువ కెనడియన్లలో ఈ అభిప్రాయం బాగా బలహీన పడిందని సర్వే తెలిపింది.గృహ సంక్షోభం, ఆర్ధిక పరిస్ధితి, అధిక జనాభా , కొత్తగా దేశంలోకి వచ్చే వారికి వసతి తదితర అంశాలు కెనడియన్లను వలసల విషయంలో ఆందోళనకు గురిచేస్తున్నట్లుగా అధ్యయనంలో తేలింది.