హమ్మయ్య .. మొత్తానికి దివాళీ ఎపిసోడ్ తో చిందులు వేయించారు

బిగ్‌బాస్ షో( Bigg Boss Show ) ఈమధ్య ఎంత నీరసంగా, నిస్సారంగా నడుస్తోందో జనాలకి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈ క్రమంలో కంటెస్టెంట్లతో కలుపుకొని నిర్వాహకులు సైతం సోషల్ మీడియాలో ట్రోల్స్ కి గురవుతున్న సంగతి విదితమే.

 Bb Diwali Special Episode Updates , Bb Diwali Special, Bigg Boss Show, Ka, Lucky-TeluguStop.com

ఇది గమనించిన బిగ్‌బాస్ ఈ క్రమంలో దీపావళిని క్యాష్ చేసుకోవాలని గట్టిగా అనుకున్నట్టు కనబడుతోంది.అయితే ఈ పరిణామాన్ని అస్సలు ఊహించలేదు అంటున్నారు ప్రేక్షకులు.

ఈ దీపావళి స్పెషల్ షో అనేది సుదీర్ఘంగా సాగిందనే చెప్పుకోవాలి.అవును, దీపాల పండుగ సంబరం వెలిగిపోయిందనే చెప్పుకోవాలి.

ఓ వైపు ‘క, లక్కీ భాస్కర్, అమరన్’ సినిమా( Ka, Lucky Bhaskar, Amaran ) ప్రమోషన్లు చేస్తూనే… అనసూయ డాన్స్, మెహరీన్ డాన్స్ తో బిగ్‌బాస్ షో దద్దరిల్లిందనే చెప్పుకోవాలి.

Telugu Amaran, Bb Diwali, Bb Diwali Ups, Bigg Boss Show, Dulquer Salmaan, Meenak

ఆ మధ్యలోనే కంటెస్టెంట్లతో ఆడించిన విధానం బావుంది అంటూ ప్రేక్షకులు సంతృప్తి చెందారు.ఇక అన్నింటికీ మించి టాలీవుడ్లో లేడీ పవర్ స్టార్ గా గుర్తింపు పొందిన సాయిపల్లవి( Sai Pallavi ) రాక ఓ వైపు కంటెస్టెంట్లతో పాటు, చూసిన ప్రేక్షకులను కూడా అలరించింది.ఆమధ్య హైపర్ ఆది పంచులు ఉండనే ఉన్నాయి.

ఈ సీజన్‌లో షో కాస్త రక్తికట్టడం ఇదే తొలిసారి అని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.ఈ మూడున్నర గంటల పెద్ద ఎపిసోడ్ లో మొదట చెప్పాల్సింది సమీరా భరద్వాజ్ ( Sameera Bhardwaj )గురించి.

ఈ గాయకురాలు తనే కంటెస్టెంట్ల మీద పాటలు రాసి, పాడడం కొసమెరుపు.వారిని పొగుడుతూ, కాస్త ఫన్ జనరేట్ చేస్తూ రాసి, పాడిన తీరుని కొనియాడకుండా ఉండలేము.

Telugu Amaran, Bb Diwali, Bb Diwali Ups, Bigg Boss Show, Dulquer Salmaan, Meenak

లక్కీ భాస్కర్ హీరో దుల్కర్ సల్మాన్, హీరోయిన్ మీనాక్షి ( Dulquer Salmaan, heroine Meenakshi )కాసేపు సరదాగా కంటెస్టెంట్లతో మాట్లాడారు.‘క’ సినిమా టీమ్ కూడా బాగానే తమ ప్రమోషన్స్ చేసుకున్నారు.ఇక అమరన్ సినిమా ప్రమోషన్ కోసం సాయిపల్లవితోపాటు శివకార్తికేయన్, దర్శకుడు రాజకుమార్ కూడా రావడం నచ్చింది.ఈసారి సీజన్‌లో రేటింగ్స్ రాకపోవడం వలన కాస్త మనసు పెట్టి గేమ్స్, ఇతర హంగామా కోసం కష్టపడినట్టున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు.

ఇక నాగార్జున వీకెండ్ షోకు రావడమే కాకుండా గ్రూప్ డాన్సులను వేయిస్తాడని టాక్ నడుస్తోంది.ఇక దీపావళి హంగామా ముగిసింది కాబట్టి, మళ్లీ రేపటి నుంచి నామినేషన్ల అరుపులు, పిచ్చి కేకలు, సర్వసాధారమే.

ఐతే రానున్న ఎపిసోడ్స్ మాత్రం మరింత రక్తికట్టించేవిగా ప్లాన్ చేస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube