నా జీవితం లో నేను చేసిన పెద్ద తప్పు మహేష్ బాబు ఆగడు సినిమానే : శ్రీను వైట్ల

శ్రీను వైట్ల( Srinu Whitela ) దర్శకత్వం వహించిన యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఆగడు (2014) అట్టర్ ప్లాప్ అయిన సంగతి తెలిసిందే.14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమా నిర్మాతలకు విపరీతమైన నష్టాలను తెచ్చిపెట్టింది.ఇందులో మహేష్ బాబు, తమన్నా భాటియా, సోనూ సూద్ కీ రోల్స్ పోషించారు, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం సపోర్టింగ్ రోల్స్ లో మెరిశారు.క్యాస్టింగ్ విషయంలో ఎలాంటి లోటు లేదు కానీ ఈ సినిమా స్టోరీనే వరస్ట్ గా ఉందని చెప్పుకోవచ్చు.

 Srinu Vaitla About Agadu Movie Flop ,srinu Whitela, Agadu Movie, Dukudu, Mahesh-TeluguStop.com

ఇది రొటీన్ కాప్ స్టోరీగా రావడం వల్ల చాలామంది దీనిని చూడడానికి ఇష్టపడలేదు.

Telugu Reels, Agadu, Dukudu, Mahesh Babu, Sonu Sood, Srinuvaitla, Srinu Whitela,

మహేష్ “దూకుడు” సినిమా( Dukudu ) తర్వాత ఈ మూవీపై అంచనాలు కూడా భారీ రేంజ్ లో ఉన్నాయి.వాటిని అందుకోకపోవడం వల్ల ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది.ఆగడు సినిమాని చాలామంది దూకుడు 2.0, “దూకుడు”కు పూర్ రీమేక్ అని కూడా విమర్శించారు.సేమ్ అదే కాప్ స్టోరీ లాగా ఉండటంతో ప్రేక్షకులు నిరాశపడ్డారు.

నిజానికి శ్రీను వైట్ల “ఆగడు” సినిమా ( agadu movie )కోసం రాసుకున్న కథ ఇది కాదట.ఆయన ఓ పెద్ద కాన్వాస్‌ స్క్రిప్ట్ తో అద్భుతమైన సినిమా తీద్దామని అనుకున్నాడు.

దానికి బడ్జెట్ పెట్టేంత స్తోమత నిర్మాతల వద్ద లేదట.అందుకే మామూలు రూరల్ బ్యాక్ డ్రాప్ లో సినిమా తీశారు.

Telugu Reels, Agadu, Dukudu, Mahesh Babu, Sonu Sood, Srinuvaitla, Srinu Whitela,

శ్రీను వైట్ల “ఆగడు” సినిమా తన లైఫ్ లో బిగ్గెస్ట్ రిగ్రెట్ అని చెప్పాడు.ఆయన ఓ రీసెంట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ “నా జీవితంలో అతిపెద్ద పశ్చాత్తాపం ఏదైనా ఉందంటే అది ఆగడు సినిమా తీయడమే.ఎందుకంటే ఈ సినిమాకు సంబంధించి ప్రతి నిర్ణయం నేనే తీసుకున్నాను.ఆ నిర్ణయాలు తీసుకోవడానికి గల కారణాలు చాలా తెలివి తక్కువగా ఉంటాయి.నిజానికి ఆగడు సినిమా కథ అది కాదు.నేను ఒక మంచి స్క్రిప్ట్ రెడీ చేసుకొని మహేష్ బాబుకి వినిపిస్తే అది విని ఆయన చాలా ఇంప్రెస్ అయ్యారు.

దూకుడు తర్వాత ఇలాంటి సినిమా తీస్తే చాలా బాగుంటుంది అని కూడా అన్నారు.కానీ ఈ సినిమా నిర్మాతలైన రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర ఆర్థిక పరిస్థితి అంత మాత్రమే ఉంది.

వారు నాకు ఫ్రెండ్స్ కాబట్టే వాళ్ల పరిస్థితి నాకు వెంటనే తెలిసింది.అందుకే బడ్జెట్ ఎక్కువ అవసరం లేని స్టోరీతో సినిమా తీద్దామని నిర్ణయించుకున్నాం.

ఆ కథతోనే 100% ఎఫెక్ట్స్ పెట్టి సినిమా తీశాను. కానీ తర్వాత క్రియేట్ అయిన హైప్‌కి సినిమా రీచ్ అవ్వలేకపోయింది.

అందుకే అది ఫెయిల్ అయింది.అదే నా కథతో నేను ఈ సినిమా తీసి ఉంటే మంచిగా ఆడుండేది, పెద్ద హిట్ అయి ఉండేది.

అందుకే నా గొయ్యి నేనే తీసుకున్నానని రిగ్రెట్ గా ఫీల్ అవుతుంటాను” అని చెప్పుకొచ్చాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube