ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున లాంటి నలుగురు హీరోలు నాలుగు పిల్లర్లుగా ఉండేవారు.వీళ్ళు చేసే ప్రతి సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతూ ఉండేవారు.
అందువల్లే వీళ్ళ సినిమాలు ప్రేక్షకులను ఎక్కువగా అలరించడమే కాకుండా స్టార్ హీరోలుగా కూడా వీళ్ళని వీళ్లు రిప్రజెంట్ చేసుకోవడంలో ఎప్పటికప్పుడు సక్సెస్ అవుతూ వచ్చారు.ఇప్పుడు ఇండస్ట్రీ మారిపోయింది.

వరుస సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్న స్టార్ హీరోలందరూ వాళ్ళని వాళ్ళు రిప్రెజెంట్ చేసుకోవడానికి చేస్తున్న సినిమాలు కూడా పెద్దగా విజయాలను సాధించలేకపోతున్నాయి.ఇక కుర్ర హీరోలు పాన్ ఇండియాలో( Pan India ) సూపర్ సక్సెస్ లను సాధిస్తుంటే సీనియర్ హీరోలు మాత్రం తెలుగుకే పరిమితమైపోతున్నారు.కారణం ఏదైనా కూడా వాళ్లని వాళ్లు స్టార్లుగా ప్రొజెక్ట్ చేసుకోవడంలో చాలా వరకు వెనుకబడిపోతున్నారు.ఇక మలయాళం సినిమా ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ హీరోలు అయిన మోహన్ లాల్( Mohan Lal ) మమ్ముట్టి( Mammootty ) లాంటివారు మంచి కాన్సెప్ట్ లతో సినిమాలను చేస్తూ పాన్ ఇండియా రిలీజ్ లను చేస్తున్నారు.
కానీ మన వాళ్లు మాత్రం తెలుగులోనే సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.ఇక కంటెంట్ లో బలం ఉన్నప్పుడు పాన్ ఇండియా రిలీజ్ చేస్తే ఆ సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధిస్తాయి కదా అంటూ కొంతమంది సినీ విమర్శకులు మన సీనియర్ హీరోలను విమర్శిస్తున్నారు.

చిరంజీవిని( Chiranjeevi ) మినహాయిస్తే మిగిలిన హీరోలందరు పాన్ ఇండియా సినిమాలంటే భయపడిపోతున్నారు.కారణం ఏంటి అంటే వాళ్ల సినిమాలకు అక్కడ ఆదరణ దక్కకపోతే మిగతా హీరోలతో పోల్చుకొని మనల్ని మనం తక్కువ చేసుకున్న వాళ్ళం అవుతాం అనే ఉద్దేశ్యంతోనే వాళ్ళు పాన్ ఇండియా సినిమాలను ట్రై చేయడం లేదు.మరి ఇకమీదటైనా కూడా మంచి కాన్సెప్ట్ తో వచ్చి పాన్ ఇండియా సినిమాలు చేసి సక్సెస్ లను సాధిస్తే చూడాలని వాళ్ళ అభిమానులు కోరుకుంటున్నారు.మరి వాళ్ళ అభిమానుల కోరిక మేరకు సినిమాలు చేస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది…
.