తమిళ్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న నటుడు సూర్య( Suriya )… తనదైన రీతిలో సినిమాలు చేయడమే కాకుండా తనను తాను స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాడు.ఇక ఇప్పుడు ఆయన చేసిన ‘కంగువా( Kanguva )’ సినిమా రిలీజ్ కి రెడీ అవుతుంది.
మొదట ఈ సినిమాని దసర కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేశారు.కానీ రజనీకాంత్ ‘వేట్టయన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడంతో ఈ సినిమాని పోస్ట్ పోన్ చేశారు.
ఇక దీపావళికి కూడా భారీ సినిమాలు వస్తున్నా నేపధ్యం లో ఈ సినిమాని సోలో రిలీజ్ చేయాలనే ఉద్దేశ్యంతో నవంబర్ 14వ తేదీన రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.మరి ఈ డేట్ ని కూడా మారుస్తారా? లేదంటే అదే డేట్ నా వస్తారా అనే దానిమీద సరైన క్లారిటీ అయితే రాలేదు.ఒకవేళ ఈ డేట్ ని కనక మార్చినట్లైతే ఈ సినిమా మీద ఎంతో కొంత ఉన్న అంచనాలు కూడా తగ్గిపోతాయి అంటూ సినీ విమర్శకులు సైతం సినిమా మేకర్స్ ను విమర్శిస్తున్నారు.మరి సూర్య లాంటి స్టార్ హీరో పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ ని సాధించాలంటే ఇలాంటి ఒక గ్రాఫికల్ విజువల్ వండర్ సినిమానే సరైన సినిమా అంటూ ప్రేక్షకులు భావిస్తున్నారు.
కాబట్టి ఈ సినిమాతో తను సోలోగా వచ్చి భారీ సక్సెస్ ని సాధించాలనే ఉద్దేశ్యం తోనే ఈ సినిమాని పోస్ట్ పోన్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది…ఇక తన తదుపరి సినిమాని కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్ లో చేస్తున్నాడు.కాబట్టి వరుసగా రెండు సినిమాలతో సూపర్ సక్సెస్ ని సాధించాలని సూర్య భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.చూడాలి మరి ఈ సినిమా సక్సెస్ సాధిస్తుందా లేదా అనేది…
.