కొట్టే ధైర్యం ఉంటే నేను చాలామందిని కొట్టేదానిని.. అవికా గోర్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు ఇతర ఇండస్ట్రీలలో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న నటీమణులలో అవికా గోర్( Avika Gor ) ఒకరు.తక్కువ సినిమాల్లోనే నటించినా ఈ బ్యూటీకి చెప్పుకోదగ్గ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

 Avika Gor Shocking Comments Goes Viral In Social Media Details, Avika Gor, Heroi-TeluguStop.com

ఈ బ్యూటీ తాజాగా మాట్లాడుతూ కాపాడాల్సిన వాడే అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పుకొచ్చారు.బాలనటిగా( Child Artist ) కెరీర్ ను మొదలుపెట్టిన అవికా గోర్ తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి తాజాగా చెప్పుకొచ్చారు.

తనకు రక్షణ కల్పిస్తాడని ఒక వ్యక్తికి బాడీ గార్డ్( Bodyguard ) జాబ్ ఇచ్చానని అయితే ఆ వ్యక్తే తనతో అసభ్యంగా ప్రవర్తించాడని అవికా గోర్ ఎమోషనల్ అయ్యారు.తాను పెద్దయ్యాక కూడా ఎన్నో హింసలు, సవాళ్లను ఎదుర్కొన్నానని ఆమె పేర్కొన్నారు.

ఒక ఈవెంట్ లో బాడీగార్డ్ నన్ను దారుణంగా తాకాడని అవికా గోర్ తెలిపారు.ఆ వ్యక్తి నాతో అసభ్యంగా ప్రవర్తించిన వెంటనే సీరియస్ గా చూసి ఏంటీ అని అడిగానని ఆమె పేర్కొన్నారు.

Telugu Avika Gor, Avikagor-Movie

ఆ వ్యక్తి వెంటనే నన్ను క్షమాపణలు కోరాడని ఆమె చెప్పుకొచ్చారు.ఆ క్షణం అతనిని క్షమించానని అయితే అతని తీరులో మాత్రం ఎలాంటి మార్పు రాలేదని అవికా గోర్ చెప్పుకొచ్చారు.అలా తప్పుగా ప్రవర్తించిన సమయంలో ఆ వ్యక్తిని కొట్టే ధైర్యం నాకు ఉంటే ఈపాటికి నేను చాలామందిని కొట్టేదాన్నని అవికా గోర్ పేర్కొన్నారు.కానీ ఇప్పుడు నాకు ఆ ధైర్యం ఉందని అవికా గోర్ తెలిపారు.

Telugu Avika Gor, Avikagor-Movie

అవికా గోర్ చెప్పిన ఈ విషయాలు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి.సెలబ్రిటీలకు ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.అవికా గోర్ కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది.ప్రముఖ హీరోయిన్ అవికా గోర్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube