కొట్టే ధైర్యం ఉంటే నేను చాలామందిని కొట్టేదానిని.. అవికా గోర్ కామెంట్స్ వైరల్!
TeluguStop.com
టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు ఇతర ఇండస్ట్రీలలో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న నటీమణులలో అవికా గోర్( Avika Gor ) ఒకరు.
తక్కువ సినిమాల్లోనే నటించినా ఈ బ్యూటీకి చెప్పుకోదగ్గ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
ఈ బ్యూటీ తాజాగా మాట్లాడుతూ కాపాడాల్సిన వాడే అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పుకొచ్చారు.బాలనటిగా( Child Artist ) కెరీర్ ను మొదలుపెట్టిన అవికా గోర్ తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి తాజాగా చెప్పుకొచ్చారు.
తనకు రక్షణ కల్పిస్తాడని ఒక వ్యక్తికి బాడీ గార్డ్( Bodyguard ) జాబ్ ఇచ్చానని అయితే ఆ వ్యక్తే తనతో అసభ్యంగా ప్రవర్తించాడని అవికా గోర్ ఎమోషనల్ అయ్యారు.
తాను పెద్దయ్యాక కూడా ఎన్నో హింసలు, సవాళ్లను ఎదుర్కొన్నానని ఆమె పేర్కొన్నారు.ఒక ఈవెంట్ లో బాడీగార్డ్ నన్ను దారుణంగా తాకాడని అవికా గోర్ తెలిపారు.
ఆ వ్యక్తి నాతో అసభ్యంగా ప్రవర్తించిన వెంటనే సీరియస్ గా చూసి ఏంటీ అని అడిగానని ఆమె పేర్కొన్నారు.
"""/" /
ఆ వ్యక్తి వెంటనే నన్ను క్షమాపణలు కోరాడని ఆమె చెప్పుకొచ్చారు.
ఆ క్షణం అతనిని క్షమించానని అయితే అతని తీరులో మాత్రం ఎలాంటి మార్పు రాలేదని అవికా గోర్ చెప్పుకొచ్చారు.
అలా తప్పుగా ప్రవర్తించిన సమయంలో ఆ వ్యక్తిని కొట్టే ధైర్యం నాకు ఉంటే ఈపాటికి నేను చాలామందిని కొట్టేదాన్నని అవికా గోర్ పేర్కొన్నారు.
కానీ ఇప్పుడు నాకు ఆ ధైర్యం ఉందని అవికా గోర్ తెలిపారు. """/" /
అవికా గోర్ చెప్పిన ఈ విషయాలు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి.
సెలబ్రిటీలకు ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.అవికా గోర్ కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది.
ప్రముఖ హీరోయిన్ అవికా గోర్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.
అమెరికా అత్యున్నత దర్యాప్తు సంస్థకు అధిపతిగా కశ్యప్ పటేల్ .. ట్రంప్ కీలక ప్రకటన