శ్రీకాంత్ అయ్యంగార్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి పట్టిన ఓ దరిద్రం.. తరిమేయాల్సిందే..?

ప్రముఖ యాక్టర్, రైటర్ కృష్ణస్వామి శ్రీకాంత్ అయ్యంగార్ రీసెంట్‌గా జర్నలిస్టులు, సినిమా రివ్యూవర్లపైన చాలా దారుణమైన పదజాలాన్ని ఉపయోగించాడు.పొట్టేల్ సక్సెస్ మీట్‌లో( Pottel Success Meet ) పాల్గొన్న ఈ నటుడు “దరిద్రానికి విరేచనాలు అయితే సినిమా రివ్యూ రైటర్లు( Movie Review Writers ) పుడతారట.

 Every One Fires On Actor Srikanth Iyengar Details, Srikanth Iyengar, Actor Srika-TeluguStop.com

వీళ్లు క్రిముల దొడ్డి నాకేవాళ్లు.బ్లడీ పారసైట్స్ వీళ్లు, అందర్నీ ఆపేయాలి.

సినిమా డ్రాగ్‌ అయింది అంటూ రివ్యూలు ఇచ్చేస్తారు.జీవితంలో వీళ్ళకి ఒక్క షార్ట్ ఫిలిం కూడా తీయడం చేతకాదు.

సినిమా ఎలా తీస్తారో కూడా రఫ్ ఐడియా లేని నా కొడుకులు.రివ్యూలు రాసేస్తున్నారు.

ఈ దరిద్రులను వెళ్ళగొట్టాలి” అని శ్రీకాంత్ అయ్యంగార్( Srikanth Iyengar ) మైక్ పట్టుకుని మాట్లాడాడు.

Telugu Critics, Review Writers, Pottel, Pottel Meet, Srikanthiyengar-Movie

ఇప్పుడు ఆయన చేసిన ఆ అజ్ఞానపు మాటలు తీవ్ర కాంట్రవర్సీకి దారితీశాయి.“ఒక హోటల్ వాడు డబ్బులు తీసుకుని చెత్త ఫుడ్ పెడితే కస్టమర్ అనేవాడు తిడతాడు.సినిమా ప్రేక్షకుడు కూడా అంతే.ప్రేక్షకుడు తాను ఇచ్చిన డబ్బులకు తగినంత వినోదాన్ని సినిమా పంచకపోతే తిట్టేస్తాడు, అదే అన్యాయం అని వీళ్ళు తిరగబడటమే తప్పు.” అని నెటిజన్లు చురకలాంటిస్తున్నారు.నిజానికి రివ్యూ చేసేవాడు కూడా ఒక ప్రేక్షకుడే.అతను తనకు నచ్చిన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు.రివ్యూ ఇవ్వకుండా చేస్తామంటూ వారికి వార్నింగ్ ఇవ్వటం చాలా తప్పు అని శ్రీకాంత్ అయ్యంగార్ పై అందరూ విరుచుకుపడుతున్నారు.

Telugu Critics, Review Writers, Pottel, Pottel Meet, Srikanthiyengar-Movie

విమానయాన సర్వీసుల గురించి ఒక అభిప్రాయం వ్యక్తం చేయడానికి కనీసం విమానం ఇంజన్ అయినా తయారు చేసి ఉండాలి అన్న చందాన శ్రీకాంత్ మాటలు ఉన్నాయని కొందరు తిట్టిపోస్తున్నారు.వీళ్ళు సినిమాలు చేసేది ఎవరిని ఉద్ధరించడానికి? చెత్త సినిమాలు తీసి డబ్బులు దండుకోవడం తప్ప ప్రేక్షకులను అలరించేది ఏముంది అని కొంతమంది అతనికి బుద్ధి చెబుతున్నారు.“సినిమాల గురించి రివ్యూలు ఇచ్చేవారు కాదు దరిద్రులు అజ్ఞానపు,అహంకార కూతలు కూసే మీలాంటి దరిద్రులు సినిమా ఇండస్ట్రీ నుంచి పోవాలి” అని మరికొందరు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.

ఆయన మాట్లాడిన భాష చాలా దారుణంగా ఉందని జర్నలిస్టులు కూడా ఓ రేంజ్ లో మండిపడుతున్నారు.అంతేకాదు ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ సభ్యులు మా అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణుకు( Manchu Vishnu ) ఒక లెటర్ కూడా రాశారు.

శ్రీకాంత్ అయ్యంగారి రాయలేని పదజాలంలో జర్నలిస్టుల, సినిమా క్రిటిక్స్ మీద కామెంట్స్ చేశాడని వాళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో పేర్కొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube