బాలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలలో విద్యాబాలన్( Vidya Balan ) కు మంచి గుర్తింపు ఉంది.కెరీర్ తొలినాళ్లలో తాను ఎన్నో సవాళ్లు, రిజెక్షన్లను ఎదుర్కొన్నానని విద్యాబాలన్ పేర్కొన్నారు.
సౌత్ లో ఒక ప్రొడ్యూసర్ నన్ను అవమానించారని ఆమె తెలిపారు.ఆ నిర్మాత కామెంట్ల వల్ల దాదాపుగా ఆరు నెలల పాటు అద్దంలో చూసుకోలేకపోయానని విద్యాబాలన్ వెల్లడించారు.
విద్యాబాలన్ మాట్లాడుతూ చక్రం సినిమాతో మలయాళంలో నటిగా ఎంట్రీ ఇచ్చానని విద్యాబాలన్ పేర్కొన్నారు.
ఆ సినిమాలో మోహన్ లాల్ ( Mohanlal )హీరో అని విద్యాబాలన్ తెలిపారు.కెరీర్ తొలినాళ్లలోనే స్టార్ హీరోతో సినిమా చేస్తున్నానని తెలిసి చాలా అవకాశాలు నన్ను వరించాయని ఆమె పేర్కొన్నారు.అనివార్య కారణాల వల్ల చక్రం సినిమా, షూటింగ్ మధ్యలోనే ఆగిపోయిందని ఆమె వెల్లడించారు.
ఆ సినిమా ఆగిపోవడంతో మిగతా సినిమాలలో నన్ను తొలగించి వేరే హీరోయిన్లను పెట్టుకున్నారని విద్యాబాలన్ తెలిపారు.
ఆ తర్వాత మూడేళ్ల పాటు బాధ పడ్డానని ఏం జరుగుతుందో అర్థం కాక కుంగుబాటుకు లోనయ్యానని ఆమె చెప్పుకొచ్చారు.ఇంట్లో ప్రతిరోజూ గొడవలు జరిగేవని నా తోటివాళ్లంతా సెటిల్ అయ్యారని నేను అక్కడే ఆగిపోయానని అన్నారని విద్యాబాలన్ వెల్లడించారు.సినిమాలు మనకు సెట్ కావని అమ్మ చెబుతుండేదని ఆమె పేర్కొన్నారు.
ఆ తర్వాత కొంతకాలానికి ఒక తమిళ సినిమాలో ఆఫర్ వచ్చిందని విద్యాబాలన్ అన్నారు.కొన్నిరోజులు షూట్ చేశాక చక్రం ఆగిపోయిందని తెలిసి తమిళ నిర్మాత సైతం నన్ను తొలగించాడని విద్యాబాలన్ తెలిపారు.
ఒక్కసారి ఆమె ముఖం చూడండి హీరోయిన్ లా ఎక్కడైనా కనిపిస్తుందా? డ్యాన్స్ రాదు యాక్టింగ్ రాదు అంటూ నా తల్లీదండ్రుల ఎదుటే నిర్మాత అవమానించాడని విద్యాబాలన్ చెప్పుకొచ్చారు.ఆ సమయంలో నాపై నాకే అసహ్యం వేసిందని ప్రదీప్ సర్కార్ నాకు అండగా నిలిచారని ఆమె పేర్కొన్నారు.
విద్యాబాలన్ చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.