బాలీవుడ్ యాక్ట్రెస్ రేఖ( Rekha ) గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు.70 ఏళ్ల వయసులోనూ అందరినీ తన వైపు తిప్పుకుంటుంది.అయితే కెరీర్ తొలినాళ్లలో ఈ ముద్దుగుమ్మ అస్సలు అందంగా లేదని, బాతుపిల్లలా అందవిహీనంగా ఉందని ఆమెను విమర్శించారు.హిందీ ఫిలిం మేకర్స్ డార్క్ స్కిన్ కారణంగా ఆమెను దారుణంగా అవమానించారు.
ఈ నటి పూర్తి పేరు భాను రేఖ.తమిళ సూపర్ స్టార్ జెమినీ గణేషన్, యాక్ట్రెస్ పుష్పవల్లి జంటకు పుట్టింది.గణేషన్ పుష్పవల్లిని పెళ్లి చేసుకోలేదు.కేవలం భాను రేఖకు జన్మనిచ్చాడు.12 ఏళ్ల సమయంలోనే రేఖ తన ఫ్యామిలీని సపోర్ట్ చేయడానికి పనులు చేయాల్సి వచ్చింది.రేఖ సినిమా సెట్స్‌కి డైలీ వెళ్లాల్సిందే అని ఇంట్లో వాళ్ళు ప్రెషర్ చేసేవారు.
వెళ్లలేదంటే ఆమె సోదరుడు ఆమెను దారుణంగా కొట్టేవాడు.రేఖ 12 ఏళ్ల వయసులోనే “రంగులరాట్నం” తెలుగు సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టింది.
![Telugu Bhanu, Bollywood, Mukesh Aggarwal, Rangula Ratnam, Rekha, Tollywood, Umra Telugu Bhanu, Bollywood, Mukesh Aggarwal, Rangula Ratnam, Rekha, Tollywood, Umra](https://telugustop.com/wp-content/uploads/2024/10/Rekha-Rangula-Ratnam-bollywood-tollywood-Umrao-Jaan-Mukesh-Aggarwal-Bhanu.jpg)
ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాక ఆమె పేరును రేఖగా మార్చారు.భాను అనే పదాన్ని తొలగించి షార్ట్‌గా పిలవడం మొదలుపెట్టారు.కెరీర్ ప్రారంభంలో ఈమె చాలా నల్లగా, బాగా లావుగా ఉందని అవమానకర కామెంట్స్ చేశారు.ఓసారి ఆమె కోస్టార్ డైరెక్టర్ తో మాట్లాడుతూ ఈ నల్ల బంగారాన్ని ఎక్కడ పట్టుకొచ్చారు అంటూ అవహేళన చేశాడట.
అందరి ముందే అలా మాట్లాడడంతో రేఖ మనసు ఎంతో నొచ్చుకుంది.తల పొగరు, అహంకారం చూపిస్తూ సినిమా ఇండస్ట్రీలో పెత్తనం చెలాయిస్తున్న అందరి మగవాళ్ళని ఆమె ఎంతో ఆత్మస్థైర్యంతో ఎదుర్కొంది.
వారు మాటలు అన్నారని ఆమె భయపడలేదు.బాధ కలిగించినా అన్నిటినీ తట్టుకుంది.
ఇండస్ట్రీలో గొప్ప స్థాయికి రావాలనే పట్టుదలతో ముందడుగులు వేసింది.
![Telugu Bhanu, Bollywood, Mukesh Aggarwal, Rangula Ratnam, Rekha, Tollywood, Umra Telugu Bhanu, Bollywood, Mukesh Aggarwal, Rangula Ratnam, Rekha, Tollywood, Umra](https://telugustop.com/wp-content/uploads/2024/10/Rekha-social-media-Rangula-Ratnam-bollywood-tollywood-Umrao-Jaan-Mukesh-Aggarwal-Bhanu.jpg)
“ఉమ్రావ్ జాన్( Umrao Jaan )” సినిమాలో ఆమె చూపించిన అద్భుతమైన నటనకు గానూ జాతీయ అవార్డు వచ్చింది.ఈ సినిమాలో హీరోయిన్ పాత్రలో ఆమె ఉర్దూ భాషను చాలా బాగా మాట్లాడటం చూసి అందరూ ఆశ్చర్యపోయారు.1990లో బిజినెస్ మ్యాన్ ముఖేష్ అగర్వాల్ ని పెళ్లాడింది.కానీ వారి మ్యారేజ్ లైఫ్ ఎంతోకాలం నిలవలేదు.ఆమె లండన్‌లో ఉన్నప్పుడు ముఖేష్ ఆత్మహత్య చేసుకున్నాడు.ఆ పర్సనల్ లాస్ ఆమె జీవితాన్ని బాగా డిస్టర్బ్ చేసింది.ముఖేష్ మరణానికి రేఖనే కారణమని చాలామంది నిందించారు.
కానీ ఈ నటి అవేమీ పట్టించుకోలేదు.ఇప్పుడు ఆమె బాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా భారతదేశం వ్యాప్తంగా ఒక లెజెండరీ యాక్ట్రెస్ గా వెలుగొందుతోంది.
పర్సనల్ ట్రాజడీలు, విమర్శలు, అవమానాలు అన్నిటినీ ఎదుర్కొని ఇంత గొప్ప స్థాయికి చేరుకున్న ఆమె అందరికీ నిజమైన స్ఫూర్తిగా నిలుస్తోంది.