ఆ షాట్స్ ను డైరెక్ట్ గా కాపీ కొడతాను.. వైరల్ అవుతున్న జక్కన్న సంచలన వ్యాఖ్యలు!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి( SS Rajamouli ) గురించి మనందరికీ తెలిసిందే.ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ దర్శకుడిగా రాణించడంతో పాటు అపజయం ఎరుగని దర్శకుడిగా దూసుకుపోతున్నారు.

 Hollywood Movies Copied By Ss Rajamouli Details, Rajamouli, Hollywood, Movies Co-TeluguStop.com

ఇప్పటివరకు ఆయన దర్శకత్వం వహించిన సినిమాలు అన్నీ కూడా వరుసగా సక్సెస్ గా నిలిచిన విషయం తెలిసిందే.అంతే కాకుండా ఆ సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించాయి.23 సంవత్సరాలు 12 సినిమాలు దర్శకత్వం వహించగా ఆ సినిమాలన్నీ కూడా సరికొత్త రికార్డులు క్రియేట్ చేశాయి.అలాగే పాన్ ఇండియా లెవల్ లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా మంచి మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి.

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన దర్శకధీరుడుగా రాజమౌళి పేరు తెచ్చుకున్నారు.ఎప్పటికప్పుడు ప్రేక్షకుల అభిరుచిని దృష్టిలో ఉంచుకొని సినిమాలు చేస్తూ అద్భుత విజయాలు అందుకుంటున్న రాజమౌళి తను చేసే సినిమాల్లో కొన్ని షాట్స్‌ ను కాపీ చేస్తాడని మీడియా, సోషల్‌ మీడియా గగ్గోలు పెడుతూ ఉంటుంది.

అతను కాపీ చేసిన సీన్‌ కావచ్చు, షాట్‌ కావచ్చు ఎక్కడి నుంచి కాపీ చేసాడు అనేది ఫ్రూవ్స్‌ తో సహా మీడియాలో దర్శనమిస్తూ ఉంటాయి.ఈ విషయంలో రామ్‌ గోపాల్‌ వర్మ( Ram Gopal Varma ) తాను హాలీవుడ్‌ సినిమాల నుంచి ఇన్‌స్పైర్‌ అవుతానని, కొన్ని సీన్స్‌ కాపీ( Copied Scenes ) కూడా చేశానని బహిరంగంగానే ఒప్పుకున్నారు.

ఇక రాజమౌళి విషయానికి వస్తే.తన సినిమాల్లోని కొన్ని షాట్స్‌ హాలీవుడ్‌ సినిమాల నుంచి, ఇతర భాషా చిత్రాల నుంచి కాపీ చేసిన మాట వాస్తవమని ఒప్పుకుంటారు.

Telugu Copied, Rajamouli, Hollywood, Hollywood Copy, Ram Gopal Varma, Ss Rajamou

ఈ విషయాన్ని దాదాపు 10 సంవత్సరాల క్రితమే ఒక టీవీ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.దానికి కారణం ఏమిటి అనేది వివరిస్తూ.చిన్నతనం నుంచీ మనపై హాలీవుడ్‌ సినిమాల( Hollywood Movies ) ప్రభావం ఉంటూనే ఉంటుంది.నా వరకు నేను మన సినిమాలు ఆ స్థాయిలో ఎందుకు ఉండవు అని ఆలోచిస్తూ ఉండేవాడిని.

ఇక ఆ సినిమాల నుంచి కాపీ కొడతావు అనే మాటకు నా సమాధానం.అవును.హాలీవుడ్‌ సినిమాల్లోని షాట్స్‌ ని డైరెక్ట్‌గా కాపీ చేసేస్తాను.మన సినిమాల విషయానికి వస్తే.

మనం దేవుడిలా కొలిచే కె.వి.రెడ్డిగారు కూడా కాపీ చేశారు.ఒక క్లాసిక్‌ గా చెప్పుకునే పాతాళభైరవీ సినిమా అలాద్దీన్‌ నుంచి కాపీ చేసిందే.

అలాగే సఖి చిత్రంలో ఒక యాక్సిడెంట్‌ సీన్‌ తర్వాత హీరో, హీరోయిన్‌ ఒకరినొకరు చూసుకుంటూ వెళ్ళే సీన్‌ యాజిటీజ్‌గా ఒక హాలీవుడ్‌ సినిమాలోనిది.

Telugu Copied, Rajamouli, Hollywood, Hollywood Copy, Ram Gopal Varma, Ss Rajamou

అంతేకాదు, ఎస్‌.రాజేశ్వరరావు వంటి టాప్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఇంగ్లీషు పాటల ట్యూన్స్‌ను కాపీ చేశారు.ఆయనే కాదు, చాలా మంది మ్యూజిక్‌ డైరెక్టర్స్‌ కాపీ చేస్తుంటారు.

ఇలా చెయ్యడం ఆ సినిమాలకు, పాటలకు ఇన్‌స్పైర్‌ అయ్యాం అని చెప్పవచ్చు, డెవలప్డ్‌ వెర్షన్‌ అని చెప్పొచ్చు.కానీ, అది మేం తప్పుగా అనుకోవడం లేదు.ఎందుకంటే ఒక షాట్‌ మనకు బాగా నచ్చింది.దాన్ని మనం కూడా బాగా తియ్యాలని ట్రై చెయ్యడం ఆ డైరెక్టర్‌కి ఇచ్చే ట్రిబ్యూట్‌ గా నేను భావిస్తాను.

నా విషయానికి వస్తే.హాలీవుడ్‌ సినిమాలోని ఒక షాట్‌ని కాపీ చేస్తే.

ఒక్కోసారి దాని కంటే బెటర్‌గా రావచ్చు.మరోసారి ఒరిజినల్‌ కంటే చెత్తగా రావచ్చు.

నేను కాపీ చేసిన కొన్ని షాట్స్‌ ఒరిజినల్‌ కంటే చెత్తగా తీసినవి ఉన్నాయి.అలాగే ఒరిజినల్‌ కంటే ఇంకా బెటర్‌గా చేసినవి ఉన్నాయి.

దీని వల్ల ఆయా సినిమాలకు సంబంధించిన రైటర్స్‌కి గానీ, డైరెక్టర్స్‌కి గానీ వచ్చే నష్టం ఏమీ ఉండదు.

Telugu Copied, Rajamouli, Hollywood, Hollywood Copy, Ram Gopal Varma, Ss Rajamou

మనం కాపీ చేసిన విషయం కూడా వాళ్ళకి తెలీదు.అదే నేను ఒక తమిళ్‌ సినిమా నుంచో, మలయాళ సినిమా నుంచో కాపీ చేస్తే అది ఆ రైటర్‌కి, డైరెక్టర్‌కి ఎఫెక్ట్‌ అవుతుంది.కాబట్టి హాలీవుడ్‌ సినిమాల నుంచి ప్రేరణ పొందడం తప్పు అని నేను భావించడం లేదు.

నాకు సినిమాల మీద ఇంత గ్రిప్‌ రావడానికి కారణం, నేను డైరెక్టర్‌ అవ్వకముందు అన్ని డిపార్ట్‌మెంట్స్‌ లో వర్క్‌ చేశాను.కొన్నాళ్ళు ఎడిటింగ్‌లో, కొన్నాళ్ళు రీరికార్డింగ్‌లో ఇలా అన్ని క్రాప్ట్స్‌ని టచ్‌ చేశాను.

అలా నాకు సినిమా మీద కొంత అవగాహన కలిగింది.ఆ టైమ్‌లోనే శాంతినివాసం సీరియల్‌ చేసే అవకాశం వచ్చింది.

రాఘవేంద్రరావుగారి దర్శకత్వ పర్యవేక్షణలో ఆ సీరియల్‌ చేశాను.ఇప్పటివరకు నేను చేసిన ప్రాజెక్ట్స్‌లో పరమచెత్త ప్రాజెక్ట్‌ అదే.ఆ సీరియల్‌ అస్సలు బాగోదు.మరి దానికి అంత రేటింగ్‌ ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు.

ఈటీవీ లాంటి స్టాండర్డ్స్‌ ఉన్న సంస్థ, రాఘవేంద్రరావుగారు అసోసియేట్‌ అవ్వడం, సీరియల్‌ రిచ్‌గా ఉండడం, ప్రైమ్‌ టైమ్‌లో ఆ సీరియల్‌ ప్రసారం కావడం వీటివల్లే రేటింగ్‌ బాగా వచ్చిందనుకుంటున్నాను అని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube