టైర్ -4 కేటగిరీకి చెందిన హరికేన్ హెలెనా( Hurricane Helene ) ఆగ్నేయ అమెరికాలో విధ్వంసం సృష్టిస్తోంది.ఫ్లోరిడా, జార్జియా, నార్త్ కరోలినా, సౌత్ కరోలినా, వర్జీనియా రాష్ట్రాలను ఈ హరికేన్ వణికిస్తోంది.
దీని కారణంగా ఇప్పటి వరకు 64 మంది ప్రాణాలు కోల్పోగా, భారీ స్థాయిలో ఆస్తి నష్టం సంభవించడంతో పాటు మిలియన్ల మంది అంధకారంలో చిక్కుకున్నారు.అట్లాంటాలో 48 గంటల్లో 28.2 సెం.మీల వర్షపాతం నమోదైనట్లుగా అధికారులు తెలిపారు.1878 తర్వాత ఈ స్థాయిలో వర్షపాతం నమోదైందని గణాంకాలు చెబుతున్నాయి.
ఫ్లోరిడా( Florida )లోని బిగ్‌బెండ్ ప్రాంతంలో గంటకు 225 కి.మీ వేగంతో కూడిన గాలులు వీచినట్లు వాతావరణ శాఖ తెలిపింది.బలహీనపడిన తర్వాత హెలెనా.
నార్త్, సౌత్ కరోలినా.టెనస్సీ రాష్ట్రాల్లో కుండపోత వర్షాలకు కారణమైంది.
హరికేన్ కారణంగా నార్త్ కరోలినాలో కొండచరియలు విరిగిపడటం, వరదల కారణంగా ఇంటర్‌స్టేట్ 40 సహా ఇతర రహదారులను మూసివేయాల్సి వచ్చింది.ఈస్ట్ టేనస్సీలోని గ్రామీణ యునికోయ్ కౌంటీలో వందలకొద్దీ రెస్క్యూ ఆపరేషన్స్ నిర్వహించాయి.
డజన్లకొద్దీ రోగులును, సిబ్బందిని శుక్రవారం ఓ హాస్పిటల్ నుంచి హెలికాఫ్టర్ ద్వారా రక్షించారు.నార్త్ కరోలినాలో ఒక శతాబ్ధంలో అత్యంత దారుణమైన వరదలకు కారణమైంది.గవర్నర్ రాయ్ కూపర్ దీనిని జాతీయ విపత్తుగా అభివర్ణించారు.19 రాష్ట్రాలకు చెందిన సహాయక బృందాలు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి.
హరికేన్ హెలెనాపై అధ్యక్షుడు జో బైడెన్ మాట్లాడుతూ.సహాయక చర్యలు ముమ్మరం చేసినట్లుగా చెప్పారు.బాధితులు, రెస్క్యూ ఆపరేషన్ కోసం సమాఖ్య నిధులను అందుబాటులో ఉంచినట్లుగా తెలిపారు.హెలెనా కారణంగా సౌత్ కరోలినా( South Carolina)లో కనీసం 25 మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్లుగా సమాచారం.1989లో చార్లెస్టన్‌కు ఉత్తరాన వచ్చిన హ్యూగో హరికేన్ కారణంగా 35 మంది మరణించిన తర్వాత ఈ రాష్ట్రంలో భారీ తుఫాను సంభవించడం ఇదే తొలిసారి.తుఫాను తెరిపించిన తర్వాత మృతుల సంఖ్య, ఆస్తి నష్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.