టాలీవుడ్( Tollywood ) ఇండస్ట్రీలో ఇప్పుడు బాగా వినిపిస్తున్న పేరు ‘ఓ సాథియా’.( O Sathiya ) ఒక ఎమోషనల్ లవ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాని డైరెక్ట్ చేసింది ఒక మహిళ.
సాధారణంగా మగాహంకారం ఎక్కువగా కనిపించే సినీ ఇండస్ట్రీలో ఆడదాన్ని ఒక ఆట బొమ్మలా చూస్తారు.హీరోయిన్ల చేత కూడా బీభత్సమైన స్కిన్ షో చేపిస్తూ, వారిచేత బెడ్ రూమ్ సీన్స్ చేయిస్తారు.
ఇక మామూలు నటీమణులను మరింత చిన్నచూపు చూస్తారు.టెక్నీషియన్ల విషయానికొస్తే ఆడవారికి ఎన్నో సవాళ్లు ఎదురవుతుంటాయి.
ఇలాంటి ఇండస్ట్రీలో ఒక మహిళా డైరెక్టర్ ( female director )గా మారడం అంటే అది ఎన్ని ఛాలెంజెస్‌తో కూడుకున్నదో అర్థం చేసుకోవచ్చు.అందుకే మగవారికి పోటీగా సినీ ఇండస్ట్రీలో ఆడవారు దర్శకులుగా మారలేకపోతున్నారు.
ఇలాంటి పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో నందిని రెడ్డి, సుధా కొంగర( Nandini Reddy, Sudha Kongara ) వంటి వారు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.తాజాగా వారి జాబితాలోకి మరొక మహిళా డైరెక్టర్ చేరిపోయింది.ఆమే దివ్య భావన( Divya bavana ).ఈ కొత్త డైరెక్టర్ సాథియా సినిమా దర్శకురాలు.ఈమె దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమాలో ఆర్యన్ గౌరా, మిస్తీ చక్రవర్తి హీరో హీరోయిన్లుగా నటించారు.బరువైన భావోద్వేగాలు, హార్ట్ టచింగ్ క్లైమాక్స్‌తో 2023, జులై 7న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా యువతను బాగా ఆకట్టుకుంది.
ఈ సినిమాతో దివ్య పేరు స్పాట్‌లైట్‌లోకి వచ్చింది.
లేడీ డైరెక్టర్ అయ్యుండి కూడా సినిమాని చాలా బాగా తెరకెక్కించిందని ప్రేక్షకులు దివ్యపై ప్రశంసలు కురిపిస్తున్నారు.ఆమె నేపథ్యం ఏంటి అని చాలామంది ఆరా కూడా తీస్తున్నారు.దివ్య భావన ప్రముఖ కథారచయిత విజయేంద్రప్రసాద్( Vijayendra Prasad ) దగ్గర కొన్నాళ్లు పనిచేసింది.
భావన తెలంగాణలోని హైదరాబాద్‌లో జన్మించింది.పుణేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో ఫిల్మ్ డైరెక్షన్ కోర్స్ పూర్తి చేసింది.గ్రాడ్యుయేషన్ తర్వాత, ఆమె అనేక తెలుగు చిత్రాలకు సహాయ దర్శకురాలిగా పనిచేసింది.2022లో, “ది లాస్ట్ లెటర్”( The Last Letter ) అనే షార్ట్ ఫిల్మ్ కు దర్శకత్వం వహించింది, ఇది విమర్శకుల నుంచి మంచి ఆదరణ పొందింది.తెలుగు సినిమా దర్శకుల సంఘంలో సభ్యురాలుగా కూడా ఉంది.ఈమె తీసిన ఓ సాథియా కానీ హీరో హీరోయిన్లు కొత్తవారు కావడం అలాగే ప్రమోషన్లు సరిగా లేక ఈ మూవీ ప్రేక్షకులను పెద్దగా చేరువ కాలేకపోయింది.
ఎలాంటి పిచ్చి సన్నివేశాలు లేకుండా మూవీని చాలా చక్కగా చూపించిన దివ్యను చాలామంది పొగుడుతున్నారు.మరొక ఆణిముత్యం తెలుగు ఇండస్ట్రీకి దొరికిందని కామెంట్ చేస్తున్నారు.