తెలుగు సినిమా ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు పూరి జగన్నాథ్(Puri Jagannath)…ఆయన తనదైన రీతిలో సినిమాలను చేసుకుంటూ ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే.ఒకప్పుడు చాలా తక్కువ రోజుల్లో సినిమాలను చేసుకుంటూ ముందుకు సాగిన పూరి జగన్నాధ్ ఇప్పుడు అనుకోకుండా చాలా స్లోగా సినిమాలు చేస్తున్నాడు.
అయినప్పటికి ఆయనకు సక్సెస్ లు మాత్రం దక్కడం లేదు.ఇక దానికి కారణం ఏంటి అంటే ఆయన కథ విషయంలో అసలు జాగ్రత్తలు తీసుకోవడం లేదనే వార్తలైతే వినిపిస్తున్నాయి.
ఇక మొత్తానికైతే ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీ(Film industry) మీద వేసిన ముద్ర అంతా ఎంత కాదు.ఒకప్పుడు పూరి జగన్నాథ్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేయడానికి చాలా మంది అసక్తి చూపించేవారు.ఇక ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లు ఎవ్వరికి లేని క్రేజ్ ఆయన ఒక్కడికే ఉండేది.అందుకే ప్రతి ఒక్కరు పూరి జగన్నాథ్ దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్(Direction Department) లో వర్క్ చేయడానికి సిద్ధంగా ఉండేవారు.
ఇక ఆయన శిష్యులు కొంతమంది ఇప్పటికే ఇండస్ట్రీలో డైరెక్టర్లుగా కొనసాగుతున్నప్పటికి మరికొంతమంది మాత్రం చేయడానికి ప్లానింగ్ లు చేసుకుంటున్నారు.ఇక మొత్తానికైతే ఆయన చేసిన సినిమాలతో భారీ సక్సెస్ లు సాధించడమే కాకుండా ఆయన స్టార్ డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకున్నాడు.
కానీ ప్రస్తుతం ఆయన చేసిన ప్రతి సినిమా డిజాస్టర్ బాట పట్టడంతో ఇప్పుడు ఆయనతో సినిమా చేయడానికి చాలామంది హీరోలు వెనుకాడుతున్నట్టుగా తెలుస్తోంది.మరి ఇప్పుడు పూరి కి డేట్స్ ఇచ్చే హీరోలు ఎవరు అనే దానిమీద సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది.మరి మొత్తానికైతే ఆయన చేసిన ప్రతి సినిమా కూడా ఇండస్ట్రీలో సక్సెస్ ని అందుకోవాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది.ఇక ఆయన పూర్వ వైభవాన్ని దక్కించుకోవాలంటే మాత్రం ఇప్పుడు ఆయన ఏదో ఒక సినిమా చేసి సూపర్ సక్సెస్ అందుకోవాలనే అవసరమైతే ఉంది…
.