అల్లంలో ఔషధ గుణాలు ఎక్కువగా ఉన్నాయి.ఆయుర్వేదంలో అల్లంను ప్రత్యేకతను ఎంతగానో ఉంది.
అందుకే చాలామంది కూరలో అల్లంను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.కరోనా కాలంలో అందరు అల్లంను ఎక్కువగా వాడుతున్నారు.
ఈ క్లిష్ట పరిస్థితుల్లో అల్లం బాగా అమ్ముడవుతోంది.మందులు నయం చేయాలని రోగాలను సైతం చిన్న అల్లం ముక్కతో నయం చేస్తుంది.
అల్లం ప్రతిదినం క్రమం తప్పకుండా వినియోగిస్తే కలిగే ప్రయోజనాలు ఎన్నో.
అల్లాన్ని రోజువారీ ఆహారంలో తినండి అని సిఫారసు చేస్తున్నారు.
ఇళ్లలో కిలోల కొద్ధీ అల్లాన్ని వాడేస్తున్నారు.అల్లం మంచి యాంటి ఆక్సీడెంట్.
రక్త నాళాలలో రక్తం గడ్డకట్టనీయకుండా సహాయపడటంలో అల్లం పాత్ర ఎంతో కీలకమైంది.స్వతహాగా అల్లం ఘాటు ఎక్కువగా ఉండి మంట పుట్టిస్తుంది.
అయితే దీన్ని తీసుకోవడం వల్ల కడుపులో అల్సర్స్ వంటివి ఏర్పడవు. కడుపులో గ్యాస్ ఏర్పడితే అల్లం దివ్యౌషధంలా పని చేస్తుంది.
షుగర్ జబ్బు నియంత్రణ చేయగలిగిన శక్తివంతమైన ఔషధం అల్లం.అజీర్తితో బాధపడుతున్న వారు అల్లం రసాన్ని తాగితే ఉపశమనం కలుగుతుంది.
నిజానికి అల్లం వల్ల కరోనా వైరస్ చచ్చిపోతుందని ఎక్కడా ఎవరూ చెప్పలేదు.కానీ అల్లం మానవ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.తద్వారా కరోనా వంటి వైరస్‌లతో పోరాడే శక్తిని ఇస్తుంది.ఇందులో యాంటీ ఇన్ ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
అల్లంలో ఉండే జింజెరోల్ వల్ల దగ్గు, జలుబు, గొంతునొప్పి వంటివి దరిచేరవు.ఒకవేళ వచ్చినా త్వరగా కోలుకుంటారు.
విపరీతమైన దగ్గు వేధిస్తున్నప్పడు అల్లం, ఉప్పు కలిపి మెత్తగా నూరుకుని తినాలి.ఇది మంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది.
రోజూ అల్లాన్ని ఏదో ఒక రూపంలో తీసుకోవడం ఉత్తమం.