తిరుపతి లడ్డు ( Tirupathi Laddu ) వ్యవహారం ఇప్పుడప్పుడే చల్లబడేలా లేదని తెలుస్తోంది.ఈ విషయం గురించి రోజుకొకరు ఏదో ఒక విషయం మాట్లాడుతూ వార్తలో నిలుస్తున్నారు.
అయితే తాజాగా మరోసారి తిరుపతి లడ్డు వ్యవహారంపై సినీనటి మాజీ మంత్రి రోజ( Roja ) స్పందించారు.గత ప్రభుత్వ హయామంలో తిరుపతి లడ్డులో కల్తీ జరిగిందని కూటమి ప్రభుత్వం ఆరోపణలు చేయడంతో ఈ ఆరోపణలపై వివిధ రకాల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సరైన ఆధారాలు బయట పెట్టకపోగా కల్తీ జరిగిందని ఆరోపణలు చేయడంతో భక్తులతో పాటు వైకాపా నాయకులు కూడా మండిపడుతున్నారు.
ఇక తిరుపతి లడ్డు తయారీలో కల్తీ జరిగిందనే విషయం తెలియగానే పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు.హిందూ మతం కోసం సనాతన ధర్మాన్ని కాపాడటం కోసం తన ప్రాణాలైనా వదులుకుంటానని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.తిరుపతి లడ్డు కల్తీ అయిందని ఆరోపణలు చేసిన చంద్రబాబు నాయుడు ( Chandra Babu Naidu ) మౌనం పాటిస్తున్న పవన్ కళ్యాణ్ మాత్రం ఈ విషయాన్ని సాగదీస్తూ ఉన్నారని పలువురు ఆరోపణలు కూడా చేస్తున్నారు.
ఈ క్రమంలోనే సినీనటి రోజా స్పందించారు.ఏపీ, తెలంగాణ ప్రజలు ఎవరు దీని నమ్మరు.కానీ ఇతర ప్రాంతాల ప్రజలు నమ్ముతున్నారు.సినిమాల్లో ఒక్కో గెటప్ ఒక్కో డైలాగులు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు ఎప్పుడు చెప్తే అప్పుడు గెటప్పులు మారుస్తూ పవన్ కళ్యాణ్ డైలాగులు చెబుతున్నారని రోజా మండిపడ్డారు.
ఆయనకు ఏదీ తెలియదని ఎవరు ఏది రాసిస్తే దాన్ని చదువుతారని రోజా తెలిపారు.తిరుపతి లడ్డు ఆరోపణల విషయంలో తప్పు చేశామని చంద్రబాబు నాయుడుకు తెలిసి సైడ్ అయిపోయి పవన్ కళ్యాణ్ ను ఆడిస్తున్నారని వెల్లడించారు.ఆయనకు ఎప్పుడు భక్తి లేదు బూట్లతోనే పూజలు చేస్తారు.తిరుమల ఆలయంలో కూడా సాక్సులు వేసుకొని వెళ్తారంటూ రోజా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తీరుపై మండిపడ్డారు.