బిగ్ బాస్ రియాల్టీ షో( Bigg Boss reality show) ని చూస్తున్న ప్రేక్షకులకు నబిల్ అనే వ్యక్తి పరిచయం అవసరం లేదు.8వ సీజన్ బిగ్ బాస్ తెలుగులో ప్రస్తుతం ప్రసారమవుతున్న సంగతి మనందరికీ తెలిసిందే.చాలా చక్కగా సాగుతున్న ఈ సీజన్ కాస్త ఇప్పుడిప్పుడే లైన్లో పడుతున్నట్టుగా కనిపిస్తుంది.కంటెస్టెంట్స్ ఎవరో తెలియకపోవడంతో మొదట్లో నిరాశ జనకంగా సాగిన ఈ సీజన్ టైం నడుస్తున్న కొద్ది పర్వాలేదనిపిస్తుంది.
వారాంతంలో నాగార్జున వచ్చి క్లాస్ పీకితే కానీ ప్రేక్షకులు చూసే పరిస్థితి లేని ఈ సీజన్ ని ఈ వారం మాత్రం ఇంటి సభ్యులు బాగానే ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే పనిలో పడ్డారు.మరి ముఖ్యంగా నబిల్( Nabeel ) గురించి మాట్లాడుకోవాలి.
ఏ క్లాన్ లో ఉన్నా సరే తనదైన ఆటతీరుతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్నాడు నవీన్.యూట్యూబర్ గా నాలుగు లక్షల మంది ఫాలోవర్స్ తో ఉన్న నబిల్( Nabeel _)చాలా తక్కువ విధిలో ఆరు లక్షలకు పరుగులు పెడుతున్నాడు అంటే అతని గురించి ప్రేక్షకులు ఆరా తీస్తున్నారనే కదా అర్థం.అతని సోషల్ మీడియా హ్యాండిల్స్ వెతికి మరి ఫాలో అవుతున్నారు.అంతలా నబిల్ కి ఈ సీజన్లో క్రేజ్ పెరుగుతుంది.పైగా వరంగల్లు కుర్రాడు కాబట్టి తెలంగాణ తెలుగు చాలా అద్భుతంగా మాట్లాడుతూ అందరిని ఎంటర్టైన్ చేస్తున్నాడు.గత ఎపిసోడ్లో ఆదిత్య ఓం మాదిరిగా మాట్లాడి ఇంటి సభ్యులతో పాటు బిగ్ బాస్ చూసే ప్రేక్షకులను కూడా బాగా నవ్వించాడు.
ఇలా వారం పెరుగుతున్న కొద్ది నబీల్ లో ఉన్న టాలెంట్ కూడా బయటకు వస్తుంది.ఇలాగే మరికొన్ని వారాల పాటు నెగ్గుకొస్తే కచ్చితంగా టాప్ ఫైవ్ లో ఉండటం మాత్రమే కాదు టైటిల్ రేసులో కూడా ఉంటాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.దీన్ని బట్టి చూస్తే లుక్స్ మరియు కటౌట్ మాత్రమే ఉంటే సరిపోదు కంటెంట్ కూడా ఉండాలి అని నబిల్ నిరూపిస్తున్నాడు.హౌస్ లో అందరూ తనకన్నా మెరుగైన మెరిట్ తో ఉన్నవారే కానీ అందర్నీ తొక్కుతూ పైకి వెళ్తున్నాడు.
మొదట్లో సోనియా నిఖిల్( Sonia , Nikhil ) లాంటి వారి గురించి బాగా చెప్పుకున్నాం కానీ ఇప్పుడు వారు కన్నా కూడా నబీల్ ముందుకెళ్లిపోయాడు.చిన్న చిన్న విషయాలకి రియాక్ట్ అవుతూ ప్రేక్షకులలో ఆసక్తిని కలిగించుతున్నాడు.
మరి చూడాలి ముందు ముందు ఎలా ఆడతాడు.కప్ రేస్ లో ఉంటాడా లేదా అనేది తెలియాలంటే ఇంకొంత కాలం తన ఆట చూడాల్సి ఉంటుంది.