మూడు గంటల సినిమా తీయడం ఒక లెక్క అయితే ఆ సినిమా మొత్తంలో ఏదో ఒక్క సీన్ ఉంటుంది.అది 1000 కోట్ల ప్రాఫిట్స్ సైతం దక్కించుకో గల సత్తా కలిగి ఉంటుంది.
అలాంటి సినిమాలు టాలీవుడ్ లో చాలా తక్కువగా ఉన్నాయి.కానీ ఆ పర్టికులర్ సీన్ మాత్రం 100 ఏళ్లయినా సరే సినిమా పరిశ్రమ ఉన్నన్ని రోజులు గుర్తుపెట్టుకునే విధంగా ఉంటాయి.
ఇలాంటి సీన్స్ మాత్రమే సినిమాని ఎంతగానో హై తీసుకురాగలవు అలాగే అంతే రేంజ్ లో సినిమాలకు పడెను గలవు.ఇంతకీ అంతలా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన సినిమాలు ఏంటి ? అందులో వచ్చిన ఆ సర్ప్రైజింగ్ సీన్స్ ఏంటి ? అనే విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
అంజి క్లైమాక్స్
చాలా ఏళ్లపాటు సినిమా నడుస్తూ ఆగిపోతూ చాలా ఏళ్లపాటు చిత్రీకరణ చేసుకున్న అంజి సినిమా క్లైమాక్స్ ఎవ్వరూ మర్చిపోలేరు ఇందులో క్లైమాక్స్ లో శివుడు కనిపించే విధానం ఇప్పటికి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది.ఎన్నేళ్లయినా సరే అంజి సినిమా క్లైమాక్స్ ( Anji Movie )కచ్చితంగా ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.ఈ సినిమాలో చాలా గ్రాఫిక్స్ వాడి చిత్రీకరించినప్పటికీ సినిమా పరాజయం పాలైంది.కానీ సినిమాలో పరమశివుడు కనిపించిన ఆ ఎఫెక్ట్స్ మాత్రం మరో లెవల్ అని చెప్పుకోవచ్చు.
కార్తికేయ 2
నిఖిల్ హీరోగా వచ్చిన పాన్ ఇండియా చిత్రం కార్తికేయ టు సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది అయితే ఈ సినిమాలో కృష్ణుడు గొప్పతనాన్ని చెబుతూ అనుపమ్ కేర్ చెప్పిన సీన్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ఒక్క సీన్ సినిమాలో హైలెట్ అని చెప్పుకోవచ్చు.అలా ఈ సినిమా విజయవంతం అవడం లో కూడా ఈ సీన్ ఎంతగానో ఉపయోగపడింది.
బాలకృష్ణ అఖండ
అఖండ సినిమా( Akhanda )లో బాలకృష్ణ ఎంట్రీ ఇవ్వగానే సినిమా థియేటర్స్ లో పూనకాలు వచ్చాయి ఇలాంటి ఒక అద్భుతమైన ఎంట్రీ నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అన్న విధంగా ఉంటుంది అతడిని అఘోర పాత్రలో చూసిన బాలయ్య అభిమానులు నిజంగానే పూనకాలు వచ్చినట్టుగా థియేటర్స్ లో ఊగిపోయారు.ఆ ఫైట్స్ ఆ ఎలివేషన్స్ చూడటానికి రెండు కళ్ళు సరిపోవు.