తనదైన రీతిలో సినిమాలను చేసి సూపర్ సక్సెస్ లను అందుకున్న హీరోలలో రవితేజ ( Ravi Teja )ఒకరు.ప్రస్తుతం ఆయనకి చాలా బ్యాడ్ టైమ్ నడుస్తుందనే చెప్పాలి.
ఎందుకంటే వరుసగా ఐదు సినిమాలతో డిజాస్టర్లను మూట గట్టుకున్న ఆయన ఇప్పుడు చేయబోయే సినిమాతో భారీ సక్సెస్ ని సాధించాలని చూస్తున్నాడు.ఇక ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలు కూడా వైవిధ్యాన్ని ప్రదర్శించే విధంగా ఉండకపోవడం వల్లే ఆయన సినిమాలు భారీగా ప్లాప్ అవుతున్నాయి అంటూ సినీ విమర్శకులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
రవితేజ కొత్తదనం కోసం అసలు ప్రయత్నం చేయకుండా రొటీన్ రొట్ట ఫార్ములా కథలనే ఎంచుకొని సినిమాలు గా చేస్తున్నాడు.అందువల్లే ఆయనకు భారీగా మైనస్ అయితే అవుతుంది.మరి ఆయన మార్కెట్ కూడా భారీగా పడిపోతుంది.ఇప్పుడున్న సిచువేషన్ లో ఆయన ఒక మంచి సినిమాను చేసి మళ్లీ సక్సెస్ సాధిస్తేనే ఆయన మార్కెట్ భారీగా పెరుగుతుంది.
లేకపోతే మాత్రం ఆయనకు భారీగా నష్టం వాటిల్లే అవకాశాలైతే ఉన్నాయి.ఇక మొత్తానికైతే తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న రవితేజ ఇప్పుడు ఆ మ్యాజిక్ ని రిపీట్ చేయడంలో మాత్రం ఫెయిల్ అయిపోతున్నాడు.
ఎందుకు ఆయన ఇలా చేస్తున్నాడనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఇక ఆయన చేసిన ప్రతి సినిమా ఒకప్పుడు ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధిస్తూ ముందుకు దూసుకెళ్లేది.అప్పట్లో రవితేజ హీరోగా చేస్తున్నాడు అంటే ఆ సినిమా మినిమం గ్యారంటీగా ఆడేది.కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ సీన్లు ఏమి కనిపించడం లేదు.ఎందుకంటే ఆయన సినిమాల మీద పెద్దగా ఫోకస్ చేసినట్టుగా కనిపించడం లేదు.ఇక ఆయన రెమ్యూనరేషన్ మీదనే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నాడంటూ చాలామంది సినీ విమర్శకులు ఆయన మీద విమర్శలను చేస్తున్నారు…
.