తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాలెంటెడ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న వాళ్లలో వివేక్ ఆత్రేయ( Vivek Athreya ) ఒకరు.ప్రస్తుతం ఉన్న యంగ్ డైరెక్టర్లందరిలో ఆయన వైవిధ్యమైన సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు.
ఇక రీసెంట్ గా నానితో చేసిన ‘సరిపోదా శనివారం( Saripodhaa Sanivaaram )’ సినిమా భారీ సక్సెస్ ని అందుకోవడంతో ఆయన పేరు మరోసారి ఇండస్ట్రీలో మారు మ్రోగిపోతుంది.ఇప్పుడు ఆయన తదుపరి సినిమాని మరొక స్టార్ హీరో తో చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది.
మరి ఆయన ఎవరు అనే విషయాల్లో సరైన క్లారిటీ లేదు కానీ తనదైన రీతిలో సినిమాలు చేయడానికి ఆయన ఎప్పుడూ ఆసక్తి చూపిస్తూనే ఉన్నాడు.ఇక మొత్తానికైతే ఆయన చేసిన ప్రతి సినిమా కూడా ఇండస్ట్రీలో తనకంటు ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసి పెడుతుంది.ఇక ప్రస్తుతం ఆయన రవితేజతో సినిమా చేయబోతున్నాడు అనే వార్తలైతే వస్తున్నాయి.ఇక ఇప్పటికే రవితేజకి కథ కూడా వినిపించారట.మరి రవితేజ( Ravi Teja) ఈ కథకి చాలా బాగా ఇంప్రెస్ అయినట్టుగా కూడా తెలుస్తుంది.
ఇక వీళ్ళ సినిమా మైత్రి మూవీ మేకర్స్( Mythri Movie Makers ) బ్యానర్ లో ఉండబోతుందనే వార్తలైతే వినిపిస్తున్నాయి.ఇక ఇప్పటికే రవితేజ లాంటి స్టార్ హీరో తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు.కాబట్టి ఇప్పుడు చేయబోయే సినిమాతో కూడా మంచి విజయాన్ని సాధించాలని ఆయన కోరుకుంటున్నట్టుగా తెలుస్తుంది.
మరి వివేక్ ఆత్రేయ తో చేసే సినిమా ఏ జానర్ కి సంబంధించింది అనేది ఇంకా తెలియదు కానీ రవితేజ మాత్రం తనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది.ఇక తొందర్లోనే ఈ న్యూస్ అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి…చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ సాధిస్తాడు అనేది…
.