రెండో సినిమాకే తట్టాబుట్టా సర్దుకోవాల్సిన వి.బి.రాజేంద్రప్రసాద్‌.. ఆయన తలరాత ఎలా మారిందంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో తమ అభిరుచికి అనుగుణంగా అద్భుతమైన సినిమాలు తీసి ప్రేక్షకులను అలరించిన దర్శకనిర్మాతలు ఎంతోమంది ఉన్నారు.వారిలో ప్రముఖ నిర్మాత, దర్శకుడు వి.

 Facts About Jagapathi Babu Father Vb Rajendra Prasad Details, Jagapathi Babu Fa-TeluguStop.com

బి.రాజేంద్రప్రసాద్‌( V.B.Rajendra Prasad ) ముందు వరుసలో నిలుస్తారు.జగపతి ఆర్ట్‌ పిక్చర్స్‌( Jagapathi Art Pictures ) పేరిట ఒక ప్రొడక్షన్ హౌస్ స్థాపించి ఆయన తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఏకంగా 30 సినిమాలను ప్రొడ్యూస్ చేశారు.1971లో వచ్చిన ‘దసరాబుల్లోడు’ సినిమాతో దర్శకుడిగా మారి సక్సెస్ అయ్యారు.అప్పటినుంచి బ్రేక్ లేకుండా 1986 వరకు సినిమాలు డైరెక్ట్ చేశారు.అంతేకాదు తన సినిమాలను తానే నిర్మించారు.వి.బి.రాజేంద్రప్రసాద్‌ దర్శకత్వంలో వచ్చిన లాస్ట్ మూవీ ‘కెప్టెన్‌ నాగార్జున్‌’. ఆయన నిర్మాణంలో వచ్చిన ఆఖరి సినిమా పెళ్లి పీటలు (1998).

వి.బి.రాజేంద్రప్రసాద్‌ చదవులో పెద్దగా రాణించలేదు కానీ మిగతా అన్ని యాక్టివిటీస్‌లో అందరికంటే చురుకుగా ఉండేవారు.ఆ సమయంలోనే “రాఘవ కళాసమితి” పేరుతో ఓ సాంస్కృతిక సంస్థను స్టార్ట్ చేశారు.

అక్కడే లెక్కలేనన్ని నాటకాల్లో నటిస్తూ గొప్ప యాక్టర్‌గా గుర్తింపును దక్కించుకున్నారు.అవార్డులు కూడా ఆయన్ను వరించాయి.

వీటితో ఆయన సంతృప్తి పడలేదు.సినిమాల్లో హీరోగా సక్సెస్ కావాలని కోరుకున్నారు.

అందుకే మద్రాస్‌కు వచ్చారు.అక్కినేని నాగేశ్వరరావుతో పరిచయం ఉండటంవల్ల ఆయన ద్వారానే అవకాశాల కోసం ట్రై చేశారు కానీ ఒక్క అవకాశం కూడా రాలేదు.

Telugu Aaradhana, Jagapathi Art, Jagapathi Babu, Savitri, Tollywood-Movie

దాంతో హీరో అవ్వాలనే తన కోరికను చంపుకున్నారు.ఆపై నిర్మాతగానైనా సెటిల్ కావాలని అనుకున్నారు.అనుకున్నదే తడవుగా తన తండ్రి జగపతి పేరుతో “జగపతి ఆర్ట్‌ పిక్చర్స్‌” సంస్థను లాంచ్ చేసి తొలి చిత్రం ‘అన్నపూర్ణ’ ప్రొడ్యూస్ చేశారు.ఇందులో జగ్గయ్య హీరో.

వి.మధుసూదనరావు దర్శకుడు.ఈ ఒక్క సినిమాలోనే కాదు వి.బి.రాజేంద్రప్రసాద్‌ వరుసగా నిర్మించిన మరో ఐదు సినిమాలకు కూడా వి.మధుసూదనరావు దర్శకత్వం వహించారు.

నిజానికి జగపతి సంస్థ ప్రొడ్యూస్‌ చేసిన రెండో సినిమానే రాజేంద్రప్రసాద్‌ కు ఎన్నో ఇబ్బందుల్ని కలిగించింది.ఆ సినిమా బెడిసి కొడితే రాజేంద్రప్రసాద్ శాశ్వతంగా సినిమాలకు దూరమైపోయేవారు.

ఆయన తన సొంత బ్యానర్ లో తీసిన ఆ రెండో సినిమా పేరు “ఆరాధన”.( Aaradhana Movie ) 1962లో వచ్చిన ఈ రొమాంటిక్ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు,( Akkineni Nageswara Rao ) సావిత్రి( Savitri ) హీరో హీరోయిన్లుగా నటించారు.

Telugu Aaradhana, Jagapathi Art, Jagapathi Babu, Savitri, Tollywood-Movie

అప్పట్లో బెంగాలీ నవలలు తెలుగు నేటివిటీకి చాలా దగ్గరగా ఉండటం వల్ల ఆ నవలల ఆధారంగానే చాలా సినిమాలు తీసేవారు.అలా “సాగరిక” అనే బెంగాలీ నవల ఆధారంగా ‘ఆరాధన’ సినిమా ప్రారంభించారు.నవల కథ అద్భుతంగా అనిపించడంతో ఈ సినిమాతో తన అదృష్టం ఒక మలుపు తిరుగుతుందని ఎంతో సంబరపడ్డారు రాజేంద్రప్రసాద్.కానీ 50% సినిమా షూటింగ్‌ పూర్తయ్యాక రాజేంద్రప్రసాద్‌కు చాలా భయం పట్టుకుంది.

ఎందుకంటే సినిమాలో ముప్పావు భాగం హీరో అంధుడిగానే కనిపిస్తాడు.రొమాంటిక్‌ హీరోగా అక్కినేని నాగేశ్వరరావు అప్పటికే బీభత్సమైన స్టార్డం తెచ్చుకున్నారు.

అలాంటి సమయంలో ఆయన్ను ఆ క్యారెక్టర్‌లో ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారా అనే ఒక అనుమానం మొదలయ్యింది.

Telugu Aaradhana, Jagapathi Art, Jagapathi Babu, Savitri, Tollywood-Movie

ఏఎన్నార్‌ నిర్మాతలో ఆందోళన చూసి ఆయన కూడా జాలిపడ్డారు.బి.ఎన్‌.రెడ్డి, కె.వి.రెడ్డి వంటి వారికి అప్పటిదాకా పూర్తి చేసిన సినిమా చూపించి సలహాలు అడుగుదామని అన్నారు.రాజేంద్రప్రసాద్ అలాగే అని ఆ డైరెక్టర్లకు ఆరాధన సినిమా అయినంతవరకు చూపించారు.

వాళ్లు కూడా ఇలాంటి సినిమా తీయడం చాలా రిస్కు అని మరింత భయపెట్టారు.ఆ మాటలు విన్నాక రాజేంద్రప్రసాద్‌కి మతిపోయినంత పని అయింది.

మరోవైపు ఏఎన్నార్‌ ఆరాధన సినిమాని అర్థంతరంగా ఆపేసి వేరే కథ ట్రై చేద్దామని సలహా ఇచ్చారు కానీ రాజేంద్రప్రసాద్ తన దగ్గర వేరే సినిమాని ఫస్ట్ నుంచి తీసేంత డబ్బులు లేవు అని స్పష్టం చేశారు.

ఏదైతే అది అయిందని ధైర్యం చేసి ఆరాధన సినిమానే కంటిన్యూ చేశారు.

సగం తీసిన షూటింగ్‌లో ఏ మార్పు చేయలేదు.నవలలో ఉన్న కథతోనే సినిమాను కంప్లీట్ చేసి 1962 ఫిబ్రవరి 16న రిలీజ్ చేశారు.

అయితే ఈ మూవీ ముందుగా అనుకున్నట్టు ఫ్లాప్ కాలేదు.థియేటర్లలో 100 రోజులు ఆడి బ్లాక్ బస్టర్ హిట్ అయింది.

దాంతో రాజేంద్రప్రసాద్ తలరాతే మారిపోయింది.ఆయన మళ్ళీ కెరీర్ లో వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

ఒకవేళ ఈ మూవీని స్క్రాప్ చేసి ఉంటే ఆయన బాగా నష్టపోయేవారు.తెలుగు సినిమా ఇండస్ట్రీలో గొప్ప నిర్మాత, దర్శకుడు అయి ఉండేవారు కాదు.

ఇండస్ట్రీలో కొనసాగాలా వద్దా అనే సందేహంలో ఉన్న తనను ‘ఆరాధన’ సినిమా అన్ని విధాల ఆదుకుందని ఆయన ఎప్పుడూ చెబుతుంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube