ఆహా ఓటీటీలో అన్‌స్టాపబుల్ సీజన్ 4 మొదలయిన సంగతి తెలిసిందే.బాలకృష్ణ (Balakrishna) హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమం అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.
ప్రస్తుతం ఈ కార్యక్రమం సీజన్4 ప్రసారమవుతుంది.ఇప్పటికీ మొదటి ఎపిసోడ్ లో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu)హాజరయ్యారు.
ఇక రెండో ఎపిసోడ్ లో భాగంగా నటుడు దుల్కర్ సల్మాన్ (Dulquer Salman) ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.లక్కీ భాస్కర్ (Lucky Bhaskar) సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా దుల్కర్ సల్మాన్ ఈ కార్యక్రమంలో సందడి చేశారు.
దుల్కర్ సల్మాన్ తో పాటు హీరోయిన్ మీనాక్షి చౌదరి డైరెక్టర్ వెంకీ అట్లూరి హాజరయ్యారు.ఇక ఎప్పటిలాగే బాలయ్య వీరితో సరదాగా ముచ్చటిస్తూ వారిని ఆటపట్టించారు.ఈషోలో దుల్కర్ తండ్రి మమ్ముట్టి ప్రస్తావన రావడంతో బాలయ్య.మీ నాన్న నాకు మంచి ఫ్రెండ్ అంటూ మమ్ముట్టి గురించి పలు విషయాలు మాట్లాడటమే కాకుండా తనకు వీడియో కాల్ చేసి మాట్లాడారు.
ఇక సినిమాల గురించి మాట్లాడుతూ.నేను మా నాన్న ఎన్టీఆర్ (NTR)గారు కలిసి పలు సినిమాలలో నటించాము.అలాగే నువ్వు కూడా మీ నాన్నతో కలిసి ఎప్పుడు నటిస్తున్నావు అంటూ ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు దుల్కర్ సమాధానం చెబుతూ నేను కూడా ఆ అవకాశం కోసమే ఎదురు చూస్తున్నానని తెలిపారు.ఈ క్రమంలోనే బాలకృష్ణ హీరో దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) కు బంపర్ ఆఫర్ ఇచ్చారు.నువ్వు నాకోసం, మా అబ్బాయి మోక్షజ్ఞ (Mokshajna)కోసం ఒక స్క్రిప్ట్ రాయి నేను కూడా మీ డాడీ నీకోసం ఒక స్క్రిప్ట్ రాసి సిద్ధం చేస్తాను అంటూ సరదాగా బాలకృష్ణ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక మోక్షజ్ఞ మొదటి సినిమా ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో మోక్షజ్ఞ (Mokshajna ,director Prashant Varma)ఎంట్రీ ఇవ్వబోతున్నారు.