కిరణ్ అబ్బవరం టాలీవుడ్ ఇండస్ట్రీలో తను కోరుకున్న భారీ హిట్ సాధించారు.క సినిమాపై(KA movie) భారీ స్థాయిలో అంచనాలు పెంచేసిన కిరణ్ అబ్బవరం ఆ అంచనాలను అందుకోవడంలో నూటికి నూరు శాతం సక్సెస్ అయ్యారు.
అయితే క మూవీ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే విడుదలైన సంగతి తెలిసిందే.ఇతర రాష్ట్రాల్లో థియేటర్ల సమస్య వల్ల ఈ సినిమాను వాయిదా వేశారు.
తెలుగులో బ్లాక్ బస్టర్ సాధించిన కిరణ్ అబ్బవరంకు(Kiran abbavaram) ఇతర భాషల్లో సక్సెస్ దక్కుతుందా అనే చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతుండటం గమనార్హం.క సినిమాకు ఇతర భాషల్లో సైతం భారీ స్థాయిలో ప్రమోషన్స్ జరగాల్సి ఉంది.
అలా జరిగితే మాత్రమే ఇతర భాషల్లో ఈ సినిమా అంచనాలను మించి హిట్ గా నిలుస్తుందని చెప్పవచ్చు.క సినిమాకు రికార్డ్ స్థాయిలో ప్రమోషన్స్ అవసరమని కామెంట్లు వినిపిస్తున్నాయి.
కిరణ్ అబ్బవరం తర్వాత ప్రాజెక్ట్ లతో క్రేజ్ ను మరింత పెంచుకోవాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.క సినిమా ఫస్ట్ డే కలెక్షన్లు(Ka movie first day collections) 4 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉండే అవకాశం అయితే ఉంది.క సినిమా బాక్సాఫీస్ రేంజ్ ఏ విధంగా ఉండనుందో చూడాల్సి ఉంది.క సీక్వెల్ ను సైతం వేగంగా సెట్స్ పైకి తీసుకెళ్తే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
కిరణ్ అబ్బవరం ఈ సినిమాతో నటుడిగా ఎన్నో మెట్లు పైకి ఎదిగారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.కిరణ్ అబ్బవరం క్రేజ్ మామూలుగా లేదని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.సోషల్ మీడియా సపోర్ట్ సైతం దక్కుతుండటం ఈ హీరోకు ప్లస్ అవుతోంది.కిరణ్ అబ్బవరం కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంది.కిరణ్ తర్వాత సినిమాలు సైతం సక్సెస్ సాధిస్తే ఈ హీరోకు మిడిల్ రేంజ్ హీరోలలో స్థానం దక్కుతుందని చెప్పవచ్చు.