ఏపీలో టిడిపి (TDP)కూటమి ప్రభుత్వం దూకుడుగా ముందుకు వెళుతోంది.ముఖ్యంగా గత వైసిపి(YCP) ప్రభుత్వంలో చోటు చేసుకున్న అవినీతి అక్రమాలను ఒక్కొక్కటిగా బయటకు తీస్తూ, ఆ పార్టీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తుంది.
ఇప్పటికే అనేక కేసులను బయటకు తీసి వైసిపి కీలక నాయకులను ఎంతోమందిని అరెస్టు చేసింది.మరికొన్ని కేసులపై దర్యాప్తు జరుగుతోంది.
దీంతో చాలామంది వైసిపి కీలక నేతలు సైలెంట్ అయిపోగా, మరికొంతమంది అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.ఇప్పటికే టిడిపి కీలక నేతలు కొంతమంది దీనిపైన ప్రకటనలు చేస్తున్నారు.
ఎవరిని వదిలిపెట్టేది లేదని, అందరి వ్యవహారాలను బయటపెడతామంటూ వైసీపీ నాయకులకు హెచ్చరికలు చేస్తున్నారు.ఇప్పటికే మైనింగ్, మద్యం, ఇసుక (Mining, liquor, sand)అక్రమాలపై విచారణ లు చేయిస్తోంది.
గనుల శాఖలో రెండున్నర వేల కోట్ల అవినీతి జరిగిందని కొన్ని అరెస్టులు కూడా చేశారు.ఇక మద్యం స్కామ్ లోనూ కేసులు పెట్టారు.
ఇక ముంబై హీరోయిన్ జాత్వాని కేసులను విచారణ జరుగుతున్నారు.
గత వైసీపీ ప్రభుత్వంలో జగనన్న కాలనీల పేరుతో పిల్లల స్థలాల పంపిణీ కోసం భూములను (Land)పెద్ద ఎత్తున సేకరించారు.ఈ పథకం లో దాదాపు 1500 కోట్లకు పైగా అక్రమాలు జరిగాయని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం అంచనా వేస్తోంది .దీంతో ఈ అక్రమాలను బయటకు తీసి వీటిలో భాగస్వామ్యం ఉన్న నేతలను జైలుకు పంపించాలనే వ్యూహంతో ఏపీ ప్రభుత్వం ఉంది .ఈ మేరకు ఈ అక్రమాలకు పాల్పడింది ఎవరు? ఈ కుంభకోణంలో లబ్ధి చేకూరింది ఎవరికి అనే లెక్కలను బయటకు తీస్తోంది.రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని లే అవుట్ లకు సంబంధించి ఏఏ ప్రాంతాల్లో భూములను కొనుగోలు చేశారు ? అప్పటి మార్కెట్ విలువ ఎంత ? ఎంత ధరకు కొనుగోలు చేశారు ? ఆ నిధులను ఎవరి ఖాతాలకు జమ చేశారు, అక్కడి నుంచి అవి ఎవరికి చేరాయి అనే అంశాలపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తోంది. లే అవుట్ల వారీగా వివరాలను సేకరిస్తుంది.ఇప్పటికే కొంతమంది వివరాలతో కూడిన జాబితాను సిద్ధం చేసింది.వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి ఆ సొమ్ములను రికవరీ చేసే విధంగా ప్రయత్నిస్తోంది.అప్పట్లో ప్రజాప్రతినిధులుగా ఉన్న వైసిపి రాష్ట్ర, నియోజకవర్గస్థాయి నేతలు మొదలుకుని, గ్రామ స్థాయి నాయకులు వరకు అనేకమంది ఈ వ్యవహారంలో కీలకపాత్ర పోషించి , అక్రమాలకు పాల్పడినట్లుగా గుర్తించింది.25 వేలకు పైగా ఎకరాల భూమి కొనుగోలుకు సంబంధించి 11,500 కోట్లకు పైగా అప్పట్లో ప్రభుత్వం ఖర్చు చేయగా, ఎక్కువ శాతం దుర్వినియోగం అయ్యాయని , వైసిపి నేతలు వివిధ మార్గాల్లో దారి మళ్లించినట్లుగా అంచనా వేస్తోంది.
భూసేకరణను అడ్డం పెట్టుకుని ఒక్కోచోట ఒక్కో విధంగా దోచుకున్నట్లు విజిలెన్స్ విచారణలో తేల్చింది. కొన్నిచోట్ల వాస్తవ మార్కెట్ విలువ కంటే అధిక ధరలకు ప్రభుత్వంతో భూములు కొనిపించి ఆ వ్యత్యాసం సొమ్ములను కాజేసినట్లు విజిలెన్స్ (Vigilance)గుర్తించింది. మరికొన్ని చోట్ల నివాసయోగ్యం కానీ భూములను ప్రభుత్వంతో అత్యధిక ధరలకు కొనుగోలు చేయించి అవినీతికి పాల్పడ్డారని నిర్ధారించింది .దీంతో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ (Vigilance and Enforcement)విభాగం ప్రత్యేకంగా ఆధారాలను సేకరిస్తుంది .ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా రాజనగరం(Rajanagaram) నియోజకవర్గంలోని బూరుగుపూడి లోని ఒక లేఅవుట్ లోనే 150 కోట్లు పైగా ఒక్కదారి పట్టిందని విజిలెన్స్ గుర్తించింది. ముంపు భూములకు అత్యధిక ధరలు ఇచ్చి కొనుగోలు చేశారని భావిస్తోంది. అలాగే తూర్పుగోదావరి , పశ్చిమగోదావరి , ప్రకాశం , గుంటూరు, కృష్ణాజిల్లాలో (East Godavari, West Godavari, Prakasam, Guntur, Krishna District)భూముల కొనుగోలులో భారీ అక్రమాలు జరిగాయని విజిలెన్స్ గుర్తించింది .దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ భూముల కొనుగోలు అక్రమాలపై పూర్తిస్థాయిలో నిగ్గు తేల్చి , ఈ అవినీతిలో భాగస్వామ్యం ఉన్న వారందరినీ అరెస్టు చేసే విధంగా టీడీపీ కూటమి ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది.