టాలీవుడ్ పాన్ ఇండియా హీరో డార్లింగ్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ప్రభాస్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
కాగా ప్రభాస్ (prabhas)చివరగా ప్రశాంత్ నీల్ (Prashanth Neil)దర్శకత్వంలో తెరకెక్కిన సలార్ 1(Salar 1) లో నటించిన విషయం తెలిసిందే.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా మంచి సక్సెస్ను సాధించింది.
అంతేకాకుండా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.ఇకపోతే ఈ సినిమాకు సీక్వెల్ గా సలార్2(Salar 2) రాబోతున్న విషయం తెలిసిందే.
ఇంకా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ని మొదలుపెట్టలేదు.
![Telugu Kgf, Prabhas, Prashanth Neel, Salar, Tollywood, Yash-Movie Telugu Kgf, Prabhas, Prashanth Neel, Salar, Tollywood, Yash-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/11/NTR-then-Yash-and-then-Prabhas-c.jpg)
ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది అన్న విషయంపై కూడా క్లారిటీ లేదు.సౌర్యంగ పర్వ లో ప్రభాస్ యాక్షన్ కోసం అభిమానులు వెయిట్ చేస్తున్నారు.అయితే ఇప్పట్లో సలార్ 2 ఉండకపోవచ్చు అనే టాక్ మొదలైంది.
కాగా ప్రభాస్ ప్రస్తుతం రాజా సాబ్ తో పాటుగా హను రాఘవపూడి(Hanu Raghavapudi) ఫౌజీ చిత్రాలు పూర్తి చేసే పనిలో ఉండగా ఆ తరవాత కూడా ప్రభాస్ స్పిరిట్ సెట్స్ మీదకు వెళ్లే ప్లాన్ చేసుకుంటున్నారు.మరోపక్క ప్రశాంత్ నీల్ ఫోకస్ మొత్తం ఎన్టీఆర్ (NTR)తో చెయ్యబోయే చిత్రం పైనే పెట్టారు.
అది నవంబర్ నుంచి రెగ్యులర్ షూట్ కి వెళ్ళాల్సి ఉన్నా ఎన్టీఆర్ మాత్రం జనవరి నుంచే ప్రశాంత్ నీల్ మూవీ సెట్స్ లోకి వెళతారు.
![Telugu Kgf, Prabhas, Prashanth Neel, Salar, Tollywood, Yash-Movie Telugu Kgf, Prabhas, Prashanth Neel, Salar, Tollywood, Yash-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/11/NTR-then-Yash-and-then-Prabhas-b.jpg)
అయితే ఎన్టీఆర్ తో మూవీ కంప్లీట్ అయ్యాక ప్రశాంత్ నీల్ ఇమ్మీడియేట్ గా సలార్2 సెట్స్ లోకి వెళ్ల నున్నారట. యష్ తో కేజీఎఫ్ 3(KGF 3 ,Yash) పూర్తి చేశాకే ప్రభాస్ సలార్ 2 చేస్తారని అంటున్నారు.మరోపక్క సలార్ 2ని అలాగే ఎన్టీఆర్ మూవీని ప్రశాంత్ నీల్ ప్యారలల్ గా పూర్తి చేస్తారనే టాక్ కూడా మొదలైంది.
మరి ఇందులో ఏది నిజమో తెలియాలి అంటే అధికారికంగా ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే మరి.