ఎన్టీఆర్( NTR ) హీరోగా నటించిన దేవర మూవీ( Devara ) ఇటీవల విడుదల అయిన విషయం తెలిసిందే.పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది.
ప్రస్తుతం ఈ సినిమా థియేటర్ల వద్ద వసూళ్ల సునామీని సృష్టిస్తోంది.అయితే ఈ సినిమా కంటే ఒక రోజు ఆలస్యంగా విడుదలైన సత్యం సుందరం( Satyam Sundaram Movie ) సినిమాకు తెలుగు లో కూడా మంచి పబ్లిక్ టాక్ వచ్చింది.
కానీ రివ్యూలలో అరుదుగా వచ్చే త్రీ రేటింగ్ సైతం దక్కిందంటే కంటెంట్ ఎంతగా కనెక్ట్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు.
అయితే దేవర హోరులో కార్తీ,( Karthi ) అరవింద్ స్వామి( Aravind Swamy ) లు చేస్తున్న సౌండ్ జనాలకు పెద్దగా వినిపించడం లేదు.పంపిణి చేసింది సురేష్ ఏషియన్ సంస్థలే అయినప్పటికీ హైదరాబాద్ లో మంచి రిలీజ్ వచ్చేలా చేసుకున్నారు కానీ చాలా బిసి సెంటర్ లలో ఈ సినిమాకు చెప్పుకోదగ్గ స్క్రీన్ లు మాత్రం దక్కలేదు.చిన్న కేంద్రాల్లో అసలు రిలీజ్ కాలేదని చెప్పాలి.
దీంతో ఆడియన్స్ కి దేవర తప్ప మరో ఆప్షన్ కనిపించకుండా పోయింది.ఇద్దరు వ్యక్తుల మధ్య ఎమోషన్స్ ని హైలైట్ చేస్తూ మూడు గంటల సేపు దర్శకుడు ప్రేమ్ కుమార్ ఈ సత్యం సుందరంని నడిపించిన తీరు ఫ్యామిలీ జనాలను బాగా ఆకట్టుకుంటోంది.
కానీ దేవర సినిమా ప్రేక్షకులు ఈ సత్యం సుందరం సినిమాను మరిచిపోయేలా చేసింది.సెప్టెంబర్ 28 కాకుండా ఒక వారం ఆలస్యంగా సత్యం సుందరం వచ్చి ఉంటే బాగుండేదని ట్రేడ్ వర్గాలు అభిప్రాయం వ్యక్తంచెస్తున్నాయి.తమిళ వెర్షన్ ముందే వచ్చినా ఇబ్బంది ఉండేది కాదని అంటున్నారు.అయితే సత్యం సుందరం లాంటి మంచి సినిమాకు ఫలితాలు ఇలా ఉండడంతో చాలామంది ఈ తప్పకుండా ఈ సినిమాకు దేవర పోటీగా రావడం శాపము.
దేవర సినిమా విడుదల కాకపోయి ఉంటే ఆ సినిమా పరిస్థితి వేరేలా ఉండేది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.