చుండ్రు సమస్యతో బాధపడుతున్నారా.? ఎంత ఖరీదైన షాంపూ వాడిన ఆ సమస్య నుంచి బయట పడలేకపోతున్నారా..? చుండ్రుతో( Dandruff ) బాగా విసిగిపోయారా.? అయితే అస్సలు చింతించకండి.ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ హెయిర్ టోనర్ ను ఒక్కసారి వాడితే చాలు చుండ్రు ఎంత తీవ్రంగా ఉన్నా సరే పరార్ అవుతుంది.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ హోమ్ మేడ్ హెయిర్ టోనర్ ను( Hair Toner ) ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు మెంతులు( Fenugreek Seeds ) వేసుకోవాలి.
అలాగే అంగుళం పొట్టి తొలగించి దంచిన అల్లం ముక్క మరియు నాలుగు నుంచి ఆరు లవంగాలు( Cloves ) వేసి ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.మరుసటి రోజు స్టవ్ ఆన్ చేసి నానబెట్టుకున్న పదార్థాలను ఉడికించాలి.
దాదాపు పది నుంచి పన్నెండు నిమిషాల పాటు ఉడికించిన అనంతరం స్టవ్ ఆఫ్ చేసే స్ట్రైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.

ఈ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ ఆముదం, వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె,( Coconut Oil ) నాలుగు చుక్కలు టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్ వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.తద్వారా మన హెయిర్ టోనర్ సిద్ధం అవుతుంది.ఈ టోనర్ ను ఒక స్ప్రే బాటిల్ లో నింపుకోవాలి.
ఆపై స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి తయారు చేసుకున్న టోనర్ ను ఒకటికి రెండుసార్లు స్ప్రే చేసుకోవాలి.

గంట లేదా గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.ఈ హెయిర్ టోనర్ ను వాడితే ఒక్క వాష్ లోనే చాలా వరకు చుండ్రు మాయమవుతుంది.ఒకవేళ చుండ్రు ఇంకా ఉంది అనుకుంటే రెండు మూడు సార్లు ఈ హెయిర్ టోనర్ ను ట్రై చేయండి.పూర్తిగా చుండ్రు వదిలిపోతుంది.పైగా ఈ హోమ్ మేడ్ టోనర్ ను వాడటం వల్ల జుట్టు కుదుళ్లు దృఢంగా మారతాయి.దాంతో జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పొడుగ్గా పెరుగుతుంది.








