రాంగోపాల్ వర్మ తాజ్ కృష్ణ హోటల్ కి సైట్ ఇంజనీర్ గా పనిచేస్తున్న రోజులు అవి.నెలకు కేవలం 800 జీతం.
అదే సమయంలో నైజీరియాలో 4,000 జీతానికి ఇంజనీర్ గా జాబ్ వచ్చింది.అయితే నైజీరియాకు వెళ్లాలని నిర్ణయించుకున్న వర్మకు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడంతో ఆగిపోవాల్సి వచ్చింది.
కానీ రాంగోపాల్ వర్మకి సినిమా పిచ్చి ఎప్పుడూ బుర్రలో ఉంది కాబట్టి తన ఫ్రెండ్ క్యాసెట్ షాప్ చూసి తాను కూడా వీడియో క్యాసెట్ షాప్ పెట్టాలని నిర్ణయించుకున్నాడు.అందుకోసం ఒక స్నేహితుల దగ్గర కొంత అప్పు చేసాడు.
అయితే రాంగోపాల్ వర్మ తండ్రి అప్పటికే రిటైర్మెంట్ తీసుకోవడానికి దగ్గర్లో ఉన్నారు.ఆయనకు వచ్చే జీతం 1500.
ఉన్న కాసిన్ని డబ్బులతో ఒక జ్యూస్ సెంటర్ పెట్టాలనుకున్నారు అదే సమయంలో అమీర్ పెట్ లో ఒక షాప్ చూసుకున్నాడు.

కానీ వర్మ ఆ షాప్ లోనే తాను వీడియో క్యాసెట్ షాప్ అదే షాప్ లో పెడతానని తండ్రిని అడిగాడు.ఆయన సమాధానం చెప్పలేదు దాంతో తన తండ్రి స్నేహితుడు ఒకరోజు బార్ కి పిలిచాడు వర్మని.వర్మ తండ్రి చూసిన షాప్ లో వీడియో క్యాసెట్ షాప్ పెట్టడం కోసం నువ్వు అడగడం పట్ల ఆయన ఎంత మదన పడుతున్నారు అనే విషయాన్ని ఆయన స్నేహితుడు వివరంగా చెప్పాడట.
కానీ ఆ సమయంలో ఇంటికి నడుచుకుంటూ వస్తూ తాను ఒక విషయం ఆలోచించారట.

ఈ రోజు నాన్న బాధపడతాడని షాప్ పెట్టడం మానేస్తే భవిష్యత్తులో నాన్న బాధపడే రోజులు వస్తాయని ఈరోజు బాధపెట్టిన సరే ముందు ముందు ఆయన్ని సుఖ పెట్టాలని వీడియో షాప్ పెట్టాలని నిర్ణయించుకున్నాడు వర్మ.ఇక చేసేదేం లేక వర్మ తండ్రి కృష్ణంరాజు వర్మ ఆ షాపు నీ కొడుక్కి ఇచ్చేసాడు.దాంతో ఆయన వీడియో క్యాసెట్ షాప్ ఓపెన్ చేశారు మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనా ఆ తర్వాత 20 వేలకు పైగా లాభాలను తెచ్చి పెట్టింది.800 జీతం నుంచి 20 వేల జీతానికి ఎదగడం పట్ల వర్మ తండ్రి ఎంతో గర్వించారు.







