లైగర్ తో మరో షాక్ ఇచ్చిన పూరీ ఆ సినిమా తర్వాత తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను ఇప్పటివరకు అనౌన్స్ చేయలేదు.లైగర్ అనుకున్నట్టుగా ఆడితే సినిమా వేరేలా ఉండేది కానీ ఆ ప్రాజెక్ట్ డిజాస్టర్ అవడం వల్ల పూరీని నమ్మి ఏ హీరో ఛాన్స్ ఇచ్చేలా లేడు.
అందుకే తన తనయుడితో పూరీ సినిమాకు రెడీ అవుతున్నాడు.ఆకాష్ పూరీ కూడా ఈమధ్య హీరోగా సినిమాలు చేస్తున్నాడు.
లాస్ట్ ఇయర్ చోర్ బజార్ అనే సినిమా తీసినా అది వర్క్ అవుట్ కాలేదు.ఫ్లాపుల్లో ఉన్న తండ్రీకొడులు ఇద్దరు కలిసి ఓ సినిమా చేస్తున్నారని తెలుస్తుంది.
అయితే పూరీ సూపర్ హిట్ మూవీ ఇడియట్ కు సీక్వెల్ గా ఇడియట్ 2 అంటూ ఈ సినిమా చేస్తున్నట్టు టాక్.ఇడియట్ సినిమాతో రవితేజకు సూపర్ ఇమేజ్ వచ్చేలా చేశాడు పూరీ జగన్నాథ్.
అదే రిపీట్ చేస్తూ ఆకాష్ పూరీని కూడా హీరోగా నిలబట్టాలని చూస్తున్నాడు.అదే నిజమైతే పూరీ మళ్లీ కంబ్యాక్ వచ్చేసినట్టే అని చెప్పొచ్చు.
ఇడియట్ 2 చంటి గాడుగా ఆకాష్ పూరీ ఎలాంటి సత్తా చాటుతాడో చూడాలి.