తెలంగాణకు కాబోయే సీఎం, ప్రస్తుత మంత్రి కేటీఆర్ లో చాల ఆందోళన, ఉత్సాహం కనిపిస్తోంది.కానీ ఆ ఆందోళన, ఉత్సాహం పైకి కనిపించకుండా, చేయాల్సిన రాజకీయమంతా చేస్తున్నారు.
ముఖ్యంగా పార్టీ ఎదుర్కొంటున్న అన్ని ఇబ్బందులను గుర్తించి మరి వాటిని పరిష్కరించే చర్యకు దిగారు.ముఖ్యంగా పార్టీ నుంచి ఎవరు బయటకు వెళ్ళకుండా చాలా జాగ్రత్తలు కేటీఆర్ తీసుకుంటున్నారు.
త్వరలో నాగార్జునసాగర్ ఉప ఎన్నికలతో పాటు, ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి ఉండడంతో అక్కడ పట్టు నిలుపుకోవాలని చూస్తున్నారు.ఇటీవల దుబ్బాక గ్రేటర్ ఎన్నికల్లో మాదిరిగా ఫలితాలు వస్తే రాబోయే సార్వత్రిక ఎన్నికలలో పూర్తిగా ఎదురు దెబ్బలు తినాలని, రాబోయే సార్వత్రిక ఎన్నికలలో ఈ ప్రభావం గట్టిగా పడుతుంది అని కేటీఆర్ బలంగా నమ్ముతున్నారు.
అందుకే ఎక్కడా అ పట్టు చేజారిపోకుండా చూసుకుంటున్నారు.దీనికోసం ముందుగా పార్టీలో నెలకొన్న ఇబ్బందికర పరిస్థితులను అధిగమించే పనిలో ఉన్నారు.
ముఖ్యంగా ఎక్కడికక్కడ నాయకుల్లో విభేదాలు తలెత్తడం, గ్రూపు రాజకీయాలు వంటి కారణంగానే ఎక్కువగా టిఆర్ఎస్ దెబ్బతింటోంది అనే విషయాన్ని కేటీఆర్ గుర్తించారు.అందుకే వాటికి చెక్ పెట్టేందుకు రంగంలోకి దిగారు.
గత మూడు రోజులుగా వరుసగా పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తూ, ఎక్కడికక్కడ అసంతృప్తులను బుజ్జగించే పనిలో కేటీఆర్ నిమగ్నమయ్యారు.దీనికితోడు త్వరలోనే పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండటంతో యువతను ఆకర్షించేందుకు రకరకాల ఎత్తుగడలు వేస్తూ, పెద్ద ఎత్తున ఉద్యోగాలు నోటిఫికేషన్ లు విడుదల చేసేందుకు గత కొంత కాలంగా ప్రయత్నిస్తూనే వస్తున్నారు.
ముఖ్యంగా ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ ల విషయంలో నేతలకు పలు సూచనలు చేస్తూ, గత మూడు రోజులుగా కేటీఆర్ బిజీగానే గడుపుతున్నారు.

అలాగే నాగార్జున సాగర్ ఉపఎన్నికల లోనూ విజయం సాధించేందుకు అనుసరించాల్సిన వ్యూహాల పైన పార్టీ నేతలతో చర్చించినట్లు తెలుస్తోంది.త్వరలోనే తాను తెలంగాణ సీఎంగా బాధ్యతలు స్వీకరించాల్సి ఉన్న నేపథ్యంలో, ఎక్కడ ఎటువంటి అపజయాలు, ఇబ్బందులు లేకుండా పూర్తిగా టిఆర్ఎస్ ప్రభావం తెలంగాణ లో కనిపించే విధంగా కేటీఆర్ జాగ్రత్త చర్యలు తీసుకుంటూ టిఆర్ఎస్ లో తన మార్క్ కనిపించేలా చర్యలు తీసుకుంటున్నారు.