ఐపీఎల్‌ను తాకిన ఆర్ఆర్ఆర్ ఫీవర్..!

ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్, ఎన్‌టీఆర్ నటనతో పాటు రాజమౌళి డైరెక్షన్‌ తోపాటు పాటలు కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి.సూపర్ హిట్ టాక్ రావడంతో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.

 Rrr Fever Touches Ipl Ipl,rrr, Movie, Update, Tollywood, Movie-TeluguStop.com

ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్ చర్చే కొనసాగుతుండటం గమనార్హం.ఇదొక పీరియాడిక్ రివెంజ్ డ్రామా కాబట్టి దానికి తగినట్టుగానే మ్యూజిక్‌ను అందించాడు కీరవాణి.

రాజమౌళి, కీరవాణి కాంబినేషన్‌లో వచ్చిన ఇతర సినిమాలలాగానే ఆర్ఆర్ఆర్ కూడా మ్యూజికల్ హిట్‌గా నిలిచింది.అయితే ఈ సినిమాలోని ఓ పాటను ఐపీఎల్ లవర్స్ తమకు నచ్చినట్టుగా మార్చుకున్నారు.

ప్రస్తుతం ఈ ఎడిటెడ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఒకవైపు థియేటర్లలో ఆర్ఆర్ఆర్, మరొకవైపు టీవీల్లో ఐపీఎల్ అటు మూవీ లవర్స్‌కు, ఇటు క్రికెట్ లవర్స్‌కు ఫుల్ ఫీస్ట్ కానున్నాయి.

ఐపీఎల్ 2022 శనివారం నుండి ప్రారంభం కానుంది.అయితే ఐపీఎల్ లవర్స్’ఆర్ఆర్ఆర్’లోని ఎత్తరా జెండా పాటకు తమ వర్షన్‌ను రాసుకొని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.ప్రస్తుతం అవి నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.ఆర్ఆర్ఆర్‌ ఒక దేశభక్తి సినిమా.1920ల్లో జరిగిన కథతో తెరకెక్కిన సినిమా.అందుకే అప్పట్లో మన దేశానికి స్వాతంత్ర్యం కోసం పోరాడిన వారందరినీ గుర్తుచేసుకుంటూ ఆర్ఆర్ఆర్ టీమ్ సెలబ్రేషన్ ఆంథమ్‌ను విడుదల చేసింది.

అదే ‘ఎత్తర జెండా’.అయితే ఈ పాటలో ప్రతీ రాష్ట్రం తరపున పోరాడిన అమరవీరుల గురించి స్పష్టంగా చెప్పారు.

అయితే ఆ అమరవీరుల ప్లేస్‌లో ఐపీఎల్ టీమ్స్‌ను పెట్టి ఒకరు ఎడిట్ చేసిన వీడియో ఐపీఎల్ లవర్స్‌ ను ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది.తమకు నచ్చిన ఐపీఎల్ టీం జెండాను ఎడిట్ చేసి, పోస్టులు చేస్తున్నారు.

ఇప్పుడు అవి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.ఐపీఎల్ లవర్స్ కూడా మీమ్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube