చర్మంపై ఎటువంటి మచ్చ ఉన్నా సరే ముఖంలో కాంతి తగ్గినట్టుగా అనిపిస్తుంది.అందుకే మచ్చలేని మెరిసే చర్మాన్ని పొందాలని చాలామంది ఆరాటపడుతుంటారు.
ఈ నేపథ్యంలోనే చర్మంపై ఏర్పడిన మచ్చలను వదిలించుకోవడం కోసం మార్కెట్లో లభ్యమయ్యే ఉత్పత్తులపై ఆధారపడుతుంటారు.అయితే ఇంట్లో ఉండే నిమ్మ తొక్కలతో మచ్చలను మాయం చేసుకోవచ్చు.
క్లియర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ ను తమ సొంతం చేసుకోవచ్చు.అవును, మీరు విన్నది నిజమే.
మరి ఇంతకీ చర్మానికి నిమ్మ తొక్కలను ఎలా ఉపయోగించాలి.? అన్నది ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా రెండు నిమ్మ పండ్లను తీసుకుని గోరు వెచ్చని నీటిలో శుభ్రంగా కడగాలి.ఆ తర్వాత వాటికి ఉండే తొక్కను సపరేట్ చేయాలి.ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో నిమ్మ తొక్కలు మరియు ఒక కప్పు రోజ్ వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

ఈ జ్యూస్ లో వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్, వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్, హాఫ్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్, హాఫ్ టేబుల్ స్పూన్ వైల్డ్ టర్మరిక్ పౌడర్ వేసుకుని అన్ని కలిసేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి.అంతే మన లెమన్ పీల్ సీరం సిద్ధమవుతుంది.ఈ న్యాచురల్ సీరంను ఒక బాటిల్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.రోజూ ఉదయం మరియు సాయంత్రం ఈ సీరంను ముఖానికి దూది సహాయంతో ఒకటికి రెండు సార్లు అప్లై చేసుకోవాలి.