తెలంగాణలోని 17 ఎంపీ స్థానాల్లో గెలవడమే బిజెపి అగ్రనతలు టార్గెట్ పెట్టుకున్నారు.ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో( Telangana assembly election ) బిజెపి ప్రభావం పెద్దగా కనిపించకపోవడంతో, ఎంపీ స్థానాల్లో గెలిచి తమపట్టు నిరూపించుకోవాలనే పట్టుదలతో ఉన్నారు.
బిజెపి అగ్రనేతలంతా తెలంగాణలోని 17 ఎంపీ స్థానాలపైన ప్రత్యేకంగా దృష్టి సారించారు.ముఖ్యంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా( Union Home Minister Amit Shah ) ఈ విషయంలో చాలా సీరియస్ గానే ఉన్నారు.
ఎప్పటికప్పుడు పార్టీ నేతలతో ఇక్కడి రాజకీయాల గురించి చర్చిస్తూ, అభ్యర్థుల గెలుపు అవకాశాలను పెంచేందుకు ఏం చేయాలనే దానిపైన అనేక సూచనలు చేస్తున్నారు.ఇప్పటికే అనేకసార్లు తెలంగాణలో పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఇక ప్రధాని నరేంద్ర మోదీ ( Prime Minister Narendra Modi )సైతం ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.ఇక నేడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ( Home Minister Amit Shah )తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.నిన్న రాత్రి హైదరాబాద్ కు చేరుకున్న అమిత్ షా అక్కడ బస చేశారు.ఈరోజు ఉదయం 10.45 కి బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి హెలికాప్టర్ లో భువనగిరికి వెళ్ళనున్నారు.ఉదయం 11 గంటలకు భువనగిరిలో జరిగే సభలో అమిత్ షా పాల్గొని మాట్లాడనున్నారు.ఉదయం 11.45 వరకు ఈ సభలోనే ఆయన ప్రసంగించనున్నారు.బిజెపి ఎంపీ అభ్యర్థి డాక్టర్ బూర నరసయ్య గౌడ్( Dr.Boora Narasiah Goud ) కు మద్దతుగా స్థానిక రాయగిరిలో నిర్వహించనున్న బహిరంగ సభలో మాట్లాడుతారు.

అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి భువనగిరి నుంచి మధ్యాహ్నం 12.15కి బేగంపేట ఎయిర్ పోర్ట్ కి చేరుకోనున్నారు.అనంతరం అక్కడ నుంచి హైదరాబాద్ లో రాష్ట్ర బిజెపి నేతలతో సమావేశం అవుతారు.తెలంగాణలో 17 ఎంపి స్థానాల్లో గెలిచేందుకు ఏం చేయాలనే దానిపైన పార్టీ నేతలకు సూచనలు చేయనున్నారు.17 స్థానాల్లో కనీసం 12 స్థానాల్లోనైనా బిజెపి అభ్యర్థులు గెలవాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నారు.బిఆర్ఎస్, కాంగ్రెస్ ఎత్తుగడలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ, కేంద్రంలో మరోసారి బిజెపిని అధికారంలోకి రాబోతోంది అనే విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని , దీనిపై విస్తృతంగా ప్రచారం నిర్వహించి , బీఆర్ఎస్ , కాంగ్రెస్ లకు అవకాశం లేకుండా చేసే విధంగా అమిత్ షా రాష్ట్ర నాయకులకు దిశా నిర్దేశం చేయనున్నారట.