అడవులలో అనేక రకాల క్రూర మృగాలు ఉండడం సహజమే.ఇక అడవికి రారాజు అయిన సింహంకు( lion ) ఒక ప్రత్యేక స్థానం ఉంది.
సింహం కేవలం ఆకలిగా ఉన్నప్పుడు మాత్రమే వేటలో పాల్గొంటుంది.అందుకోసం సింహం ప్రత్యేకమైన శైలిని అనుసరిస్తుంది.
ఎంత పెద్ద జంతువు అయినా సరే సింహానికి వేట సమయంలో ఆహారంగా మారిపోవాల్సిందే.సింహం వేటాడే జంతువు గొంతును తన పదునుగా ఉండే దంతాలతో పట్టుకొని చీల్చి క్షణకాలంలో దానిని చంపేస్తుంది.
సింహం ఆకలి పూర్తి అయ్యేంతవరకు దానిని తిని మిగతా శరీర భాగాలని అక్కడే పడేసి వెళ్తుంది.అందుకే కాబోలు సింహం అంటే మిగతా జీవాలకు ప్రత్యేక భయం.

ఇలాంటి సంఘటనలకు సంబంధించి సోషల్ మీడియాలో( social media ) అనేక వీడియోలు మనం చాలానే చూసి ఉంటారు.కాకపోతే ఇప్పుడు వైరల్ గా మారిన వీడియోలో సింహం తన పిల్లలకి వేట ఎలా చేయాలన్న దృశ్యాలు వైరల్ గా మారాయి.ఓ దట్టమైన అడవిలో కొంతమంది పర్యాటకుల నడుమ తమ కార్లలో ఉండగా ఒక దారిలో వెళ్తున్న సమయంలో ఓ సింహం తల్లి వెనక తన పిల్లలతో కలిసి వెళ్తుంది. ఇక వీడియోలో కనిపించిన పిల్ల సింహాల వయసు చూస్తే మూడు నుంచి నాలుగు నెలలు ఉండొచ్చు కాబోలు.
ఇకపోతే ఈ వీడియోని బాగా పరిశీలించినట్లయితే ఏదైనా జంతువుల బారి నుంచి ఎలా రక్షణ పొందాలో ఆ తల్లి సింహం ఆ పిల్ల సింహాలకి చెబుతున్నట్లుగా అర్థమవుతుంది.

నిజానికి ఆడ సింహాలు ( Lionesses )వారి పిల్ల సింహాలతో ఎక్కడికన్నా బయటికి వెళ్ళినప్పుడు వెంట తీసుకువెళ్తాయి.కొన్ని పరిశోధనల ప్రకారం పిల్ల సింహాలకు తన తల్లి సింహమే మాంసాన్ని ఎలా తినాలి అన్న విధానాన్ని కూడా నేర్పిస్తుందట.ఇలాంటి విషయాలలో మగసింహం ఎలాంటి జోక్యం చేసుకోదట.
పిల్ల సింహాలు తన తల్లి సింహం వద్ద కొన్ని నెలలపాటే పాలు తాగుతాయని ఆ తర్వాత అవి వేటను కొనసాగించి ఆహారాన్ని సంపాదించుకుంటాయి.అలా ఒక్కొక్కసారి పిల్ల సింహాలు వేటలో చనిపోతాయట.
ప్రస్తుతం పిల్ల సింహాలకు తల్లి సింహం ఇచ్చే ట్రైనింగ్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.