వైసీపీ మ్యానిఫెస్టో-2024 ( YCP Manifesto-2024 )పై ఆ పార్టీ నేత విజయసాయి రెడ్డి( Vijaysai Reddy) స్పందించారు.2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 99 శాతం పూర్తి చేశామని తెలిపారు.గతంలో కంటే మెరుగైన పథకాలను అందించేలా మ్యానిఫెస్టో రూపొందించామని విజయసాయి రెడ్డి తెలిపారు.రాష్ట్ర ప్రజలకు మెరుగైన పథకాలను అందించడమే జగన్ ( CM YS JAGAN )లక్ష్యమని పేర్కొన్నారు.
తొమ్మిది కీలక అంశాలతో మ్యానిఫెస్టోను రూపకల్పన చేశామని పేర్కొన్నారు.ఉన్న పథకాలను కొనసాగిస్తూ ఇచ్చే నిధుల పెంపుతో పాటు సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేసే విధంగా మ్యానిఫెస్టో ( YCP Manifesto-2024 )ఉందని తెలిపారు.
ఈ క్రమంలోనే విద్య, వైద్యం, వ్యవసాయం, అభివృద్ధి, సామాజిక భద్రతతో పాటు మహిళా సాధికారిత, నాడు-నేడు వంటి వాటికి అధిక ప్రాధాన్యత ఇచ్చామని స్పష్టం చేశారు.