అప్పుడు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోవాలనుకున్నా.. కానీ : గతాన్ని గుర్తుచేసుకున్న జో బైడెన్

తాను ఒకప్పుడు ఆత్మహత్య చేసుకుని చనిపోవాలని అనుకున్నట్లుగా సంచలన వ్యాఖ్యలు చేశారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.( US President Joe Biden ) అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ ఛానెల్‌కు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు.

 Us President Joe Biden Reveals Why He Once Thought About Committing End His Life-TeluguStop.com

ఈ సందర్భంగా బైడెన్ మాట్లాడుతూ.తనకు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వచ్చినట్లు తెలిపారు.

రాజకీయాల్లోకి వచ్చిన కొత్తల్లో 1972లో తొలిసారిగా సెనేటర్‌గా గెలుపొందిన కొన్నిరోజులకు బైడెన్ భార్య నీలియా,( Neilia ) 18 నెలల తన చిన్నారి కూతురు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేసుకున్నారు.

Telugu Joe Biden Sad, Neilia, Joe Biden, Presidential-Telugu NRI

ఆ సమయంలో కుంగిపోయిన తాను .తాగటం అలవాటు లేని తాను మందు బాటిల్ తీసుకుని డెలావేర్ మెమోరియల్ బ్రిడ్జి( Delaware Memorial Bridge ) వద్దకు వెళ్లి పీకలదాకా తాగానని బైడెన్ తెలిపారు.ఆ సమయంలోనే వంతెనపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానని.

కానీ తన మిగిలిన ఇద్దరు పిల్లలు గుర్తొచ్చి ఆ ఆలోచన విరమించుకున్నానని అమెరికా అధ్యక్షుడు వెల్లడించారు.కష్టాలు వచ్చినప్పుడు ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు చేయాల్సిన అవసరం లేదని బైడెన్ సూచించారు.

ప్రస్తుతం అధ్యక్షుడి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Telugu Joe Biden Sad, Neilia, Joe Biden, Presidential-Telugu NRI

మరోవైపు.ఈసారి అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ – బైడెన్‌లు మరోసారి తలపడుతున్నారు.ఈ సందర్భంగా ట్రంప్‌తో( Trump ) పోటీపైనా అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు చేశారు.

ఎక్కడైనా ట్రంప్‌తో చర్చా కార్యక్రమంలో పాల్గొనడం సంతోషమేనని చెప్పారు.ఇక అధ్యక్ష ఎన్నికల సందర్భంగా డిబేట్లకు సంబంధించిన ఎన్నికల తేదీలు, వేదికల వివరాలు విడుదలయ్యాయి.

సెప్టెంబర్ 16న టెక్సాస్‌లోని శాన్ మార్కోస్, అక్టోబర్ 1న వర్జీనియా రాష్ట్రంలోని పీటర్స్ బర్గ్, అక్టోబర్ 9న సాల్ట్ లేక్ సిటీలో ఈ చర్చా కార్యక్రమాలు జరగనున్నాయి.ఇకపోతే.

బైడెన్ వ్యాఖ్యలపై స్పందించారు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ సమయానికైనా బైడెన్‌తో డిబేట్‌కు ఓకేనని సోషల్ మీడియాలో వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube