సోషల్ మీడియాలో పాపులర్ కావడానికి ఓ యువకుడు చేయరని స్టంట్ చేశాడు.ఈ డేంజరస్ స్టంట్ లో ( Dangerous Stunts ) భాగంగా స్కూల్ పై కప్పు కూలిపోయి వ్యక్తి చనిపోయాడు.
ఆ యువకుని పనులపై ఆధారపడిన పేద కుటుంబం ఇప్పుడు రోడ్డుపై పడింది.ఇందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లోని( Uttar Pradesh ) బాంద్రా జిల్లాలో చోటుచేసుకుంది.21 ఏళ్ల శివమ్( Shivam ) హూప్ స్టంట్ చేయడానికి పాఠశాల ప్రాంగణానికి వెళ్లాడు.అక్కడ స్కూల్ టెర్రస్ పై తలకిందులుగా వేలాడు.టెర్రస్ కోన భాగాన్ని పట్టుకుని స్టంట్ చేశాడు.
ఇంతలో పాఠశాల స్లాబ్ ఊడిపోయింది.స్లాబ్ కు సంబంధించి రాళ్లు అతనిపై పడగా అతడు పడిపోయాడు.ఈ ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.ఈ విషయం తెలుసుకున్న కుటుంబీకులు వెంటనే పాఠశాలకు వెళ్లారు.కుటుంబానికి ఎంతో అండగా నిలవాల్సిన శివం ఈ హఠాన్మరణాన్ని తట్టుకోలేకపోయారు కుటింబీకులు.బాలుడి మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించి ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇకపోతే, మరణించిన వ్యక్తి శివమ్ స్నేహితుడు చిత్రీకరించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో షేర్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది.దాంతో సోషల్ మీడియా వినియోగదారుల నుండి స్పందనలు భిన్నంగా ఉన్నాయి.ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తూ ప్రమాదాల బారిన పడవద్దని యువతకు పోలీసులు హెచ్చరించారు
.