ప్రస్తుత రోజులలో ఎండ వేడి ( Summer Heat ) చూస్తూ ఉంటే సూర్యుడు మన దగ్గరికి వచ్చినట్లు అనిపిస్తూ ఉంటుంది.ఈ ఎండలకు ఎంత నీరు తాగినా క్షణాల్లో చెమట రూపంలో మాయమైపోతోంది.
వేసవికాలం లో మనం మన శరీరాన్ని చల్లపరిచే ఆహార పదార్థాలు, పానియాల కోసం ఎంతో డబ్బును ఖర్చు చేస్తూ ఉంటాము.ఈ సందర్భంగా మార్కెట్లో రకరకాల పండ్లు కూడా అందుబాటులో ఉంటాయి.
ప్రధానంగా వీటిని సీజనల్ ఫ్రూట్స్ అని కూడా అంటారు.ఉదాహరణకు జాక్ ఫ్రూట్, మామిడి మొదలైన పండ్లు ఉంటాయి.
వేసవికాలంలో వీటిని తింటే ఆరోగ్యం సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.కానీ ఈ పండ్లను ఎక్కువగా తీసుకుంటే మాత్రం అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
అధిక చక్కెర కంటెంట్ కలిగి ఉన్న జాక్ ఫ్రూట్( Jack Fruit ) ఎండాకాలంలో మన డిహైడ్రేషన్ సమస్యను మరింత పెంచుతుంది.దీంతో గుండె సంబంధిత సమస్యలు కూడా పెరుగుతాయి.
మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎండాకాలంలో ఎండ వేడిమి తగ్గే వరకు పనస పండుకు దూరంగా ఉండడమే మంచిది.

అలాగే ఖర్జూరం( Dates ) సహజంగా చాలా తీపిగా ఉంటుంది.కేలరీలు ఎక్కువగా ఉండే ఖర్జూరం మొదట్లో శరీరానికి శక్తిని ఇచ్చిన తర్వాత అలసటను తెస్తుంది.లిచ్చి పండు( Lychee ) వల్ల అలర్జీ వస్తుందని చాలా మంది ప్రజలు నమ్ముతారు.ఇది ఎండాకాలంలో అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు.లీచ్చి పండు తొందరగా గుండె సమస్యలను కూడా కలుస్తుంది.బీపీ ఇతర గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారు ఎక్కువగా ఎండాకాలంలో లీచ్చి పండు రసం తాగకూడదు.

అవకాడోలో( Avocado ) కొవ్వులు ఎక్కువగా ఉంటాయి.దీని వల్ల ఎండాకాలంలో మన జీర్ణ వ్యవస్థలో ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఎక్కువగా ఉంది.కాబట్టి ఆవకాడోకు ఎండాకాలంలో దూరంగా ఉండడమే మంచిది.
మామిడిపండులో కూడా చాలా తీపి ఉంటుంది.మామిడి పండ్లు( Mangoes ) తింటే కొందరికి అలసట వస్తుంది.
ఇది శరీరం డిహైడ్రేషన్ సమస్యలకు కూడా దారి తీస్తుంది.కాబట్టి మామిడి పండ్లను కాస్త తక్కువగా తీసుకోవడమే మంచిది.