సౌత్ సినీ ఇండస్ట్రీలో తెలుగు తమిళ భాష చిత్రాలలో నటిస్తూ నటిగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో వరలక్ష్మి శరత్ కుమార్( Varalakshmi Sarath Kumar ) ఒకరు.తమిళ చిత్ర పరిశ్రమకు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినటువంటి ఈమె అనంతరం సినిమాలలో విలన్ పాత్రలలో( Villain Roles ) నటిస్తూ బిజీగా ఉన్నారు.
ముఖ్యంగా తెలుగు సినిమాలలో ఈమె లేడీ విలన్ పాత్రలలో నటించడమే కాకుండా సపోర్టింగ్ రోల్స్ చేస్తూ కూడా ఎంతో బిజీగా ఉన్నారు.అలాగే లేడీ ఓరియంటెడ్ సినిమాలలో కూడా నటిస్తూ కెరియర్ పట్ల బిజీ అయ్యారు.

ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె త్వరలోనే శబరి( Sabari ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.ఈ సినిమా మూడవ తేదీ తెలుగు తమిళ భాషలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి తరుణంలో ఈమె తెలుగులో కూడా భారీ స్థాయిలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఇక ఈ సినిమా ఒక తల్లి కూతురు మధ్య అనుబంధం నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది.ఆపదలో ఉన్నటువంటి తన కూతురిని ఆ తల్లి ఎలా కాపాడుకుందన్న కథాంశంతో ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది.

ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి వరలక్ష్మి శరత్ కుమార్ ఎదుర్కొన్నటువంటి లైంగిక వేధింపుల గురించి వెల్లడించారు.నేను చిన్నప్పుడే లైంగిక వేధింపులను ఎదుర్కొన్నాను.అది నా జీవితంలో మర్చిపోలేని గాయం.అయితే చాలామంది ఇలాంటి సంఘటనలను ఎదుర్కొన్న తర్వాత వాటి గురించి తమ కుటుంబ సభ్యులతో స్నేహితులతో చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు.
ఇలాంటి విషయాలను బంధువులకు చెప్పుకుంటే మనల్ని జడ్జ్ చేస్తారు అది తెరపిస్టు ఉంటే మన సమస్యకు వాళ్లే పరిష్కారాన్ని కూడా చెబుతారు అంటూ ఈ సందర్భంగా వరలక్ష్మి శరత్ కుమార్ ఎదుర్కొన్నటువంటి లైంగిక ఇబ్బందుల గురించి చెబుతూ చేస్తున్నటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.







