ఒక ఫ్లైట్ అటెండెంట్( Flight Attendant ) నుంచి ఒక పెద్ద విమానాశ్రయానికి సీఈఓ దాకా ఎదిగిన మహిళ ఇన్‌స్పైరింగ్ స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఆమె పేరు మిత్సుకో టోట్టోరి.( Mitsuko Tottori ) జపాన్ ఎయిర్‌లైన్స్ సీఈఓగా( Japan Airlines CEO ) అవతరించిన ఆమె జీవితం అంకితభావం, పురోగతికి నిదర్శన.1985లో ఫ్లైట్ అటెండెంట్‌గా ఆమె ఎయిర్‌లైన్స్‌లో చేరింది.అనేక సంవత్సరాల పాటు, తన నైపుణ్యం, కృషిని చాటుకుంటూ అంచెలంచెలుగా ఎదిగింది.2015లో ఆమె కృషి ఫలితం దక్కింది.ఆమె సీనియర్ డైరెక్టర్‌గా పదోన్నతి పొందింది.
2024 వచ్చేసరికి చరిత్ర సృష్టించింది.జపాన్ ఎయిర్‌లైన్స్‌కు అధ్యక్షురాలు, సీఈఓగా సెలెక్ట్ అయ్యింది.ఇది కేవలం ఆమెకు మాత్రమే కాకుండా, కంపెనీకి కూడా గణనీయమైన విజయం.ఎందుకంటే ఎయిర్‌లైన్స్‌లో ఈ ఉన్నత పదవిని చేపట్టిన మొదటి మహిళ ఆమె.జపాన్‌లోని( Japan ) ప్రముఖ సంస్థలలో మహిళ నాయకత్వం వహించే కొన్నింటిలో జపాన్ ఎయిర్‌లైన్స్ ఒకటి కావడం ఆమె నియామకాన్ని మరింత విశేషంగా చేస్తుంది.

మిత్సుకో చదువుకున్న చోటిని బట్టి చూస్తే ఆమె ఎదిగిన తీరు మరింత అద్భుతం.జపాన్ ఎయిర్‌లైన్స్‌కు( Japan Airlines ) ముందు పది మంది సీఈఓలు ఎక్కువగా పేరున్న యూనివర్సిటీల నుండి వచ్చిన వారే.కానీ మిత్సుకో నాగసాకిలోని( Nagasaki ) క్వాస్సుయి క్వాస్సుయ్ మహిళా జూనియర్ కళాశాల నుంచి గ్రాడ్యుయేట్ అయ్యారు.ఇది తక్కువ పేరున్న కళాశాల.దీన్నిబట్టి విజయానికి కారణం ఎక్కడ చదువుకున్నారో కాదు, కెరీర్‌లో ఎలా కృషి చేశారనేదే ముఖ్యమైన స్పష్టంగా తెలుస్తోంది.

కోవిడ్-19 వ్యాప్తి సమయంలో, పరిస్థితులు చాలా కష్టంగా ఉండేవి.ఆ సమయంలో మిత్సుకో చూపించిన నాయకత్వం, ఆమె కృషి చాలామంది ప్రశంసలను అందుకున్నాయి.ఎయిర్‌లైన్స్ సంస్థ ఆమె అనుభవాన్ని, ఆ కష్టంలో ఆమె పోషించిన పాత్రను గుర్తించి, సీఈఓగా పదోన్నతి ఇచ్చేందుకు ముఖ్య కారణాలుగా పరిగణించింది.
కంపెనీలలో పై పదవులు మహిళలే చేపట్టడం సాధారణ విషయం కావాలని, అది అరుదైన విషయం కాకూడదని మిత్సుకో బలంగా కోరుకుంటోంది.జపాన్ వ్యాపార రంగంలో లింగ సమానత్వానికి ఆమె గొప్ప మద్దతును అందిస్తుంది.
మహిళా అధ్యక్షురాలి నియామకం సాధారణ విషయంగా జరగాలి అని ఆమె నమ్ముతుంది.ఫ్లైట్ అటెండెంట్ నుంచి సీఈఓగా టోట్టోరి ఎదిగిన కథ కష్టపడితే, పట్టుదల ఉంటే ఏ స్థాయికైనా ఎదగొచ్చని చూపించే ప్రత్యక్ష ఉదాహరణ.







