స్పాకి వెళ్లక్కర్లేదు.. ఇంట్లోనే జుట్టును ఆరోగ్యంగా, బలంగా మార్చుకోండిలా!

సాధారణంగా కొందరు నెలలో ఒక్కసారైనా హెయిర్ స్పా ట్రీట్మెంట్ ను తీసుకుంటారు.హెయిర్‌ స్పా తో వెంట్రుకలకు సంబంధించిన సమస్యలన్నీ దూరం అవుతాయి.

 Make Your Hair Healthy And Strong At Home! Healthy Hair, Strong Hair, Latest New-TeluguStop.com

దుమ్ము, మలినాలను తొలగిపోతాయి.స్కాల్ప్‌ లోతుగా శుభ్రం అవుతుంది.

జుట్టు కుదుళ్లు మరియు మూలాలు ఆరోగ్యంగా మారుతాయి.కురులు స్మూత్ అండ్ షైనీగా మెరుస్తుంది.

అందుకే హెయిర్‌ స్పా ట్రీట్‌మెంట్‌ చాలా అవసరం అని చాలా మంది భావిస్తుంటారు.

అయితే అందరికీ స్పాకు వెళ్లేంత స్తోమత లేకపోవచ్చు.

అలాంటి వారు జుట్టు విషయంలో చింతించాల్సిన అవసరం లేదు.ఎందుకంటే ఇంట్లోనే జుట్టును ఆరోగ్యంగా బలంగా మార్చుకోవచ్చు.

అందుకు కోసం ముందుగా గోరువెచ్చని కొబ్బరి నూనెను జుట్టు కుదుళ్ల‌కు బాగా పట్టించి కనీసం ప‌దిహేను నిమిషాల పాటు వేళ్ల‌తో మసాజ్ చేసుకోవాలి.నైట్ నిద్రించే ముందు ఆయిల్ ను అప్లై చేసుకుని నిద్రించాలి.

మరుసటి రోజు ఒక బౌల్‌ తీసుకుని అందులో మూడు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్‌, వన్ టేబుల్ స్పూన్ గ్లిజరిన్, రెండు టేబుల్ స్పూన్లు కోకోనట్ ఆయిల్, వన్ టేబుల్ స్పూన్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్ వేసుకుని నాలుగు లేదా ఐదు నిమిషాలు బాగా మిక్స్ చేస్తే స్మూత్ క్రీమ్‌ సిద్ధం అవుతుంది.ఇది నేచురల్ స్పా క్రీమ్.

ఈ క్రీమ్ ను జుట్టు కూతుళ్ల‌ నుంచి చివర్ల వరకు అప్లై చేసుకోవాలి.ఆ తర్వాత స్కాల్ప్ ను వేళ్ళతో స్మూత్ గా ఐదు నిమిషాల పాటు మసాజ్ చేసుకుని రెండు గంటల పాటు వదిలేయాలి.అనంతరం మైల్డ్‌ షాంపూను ఉపయోగించి తల స్నానం చేయాలి.వారంలో ఒక్కసారి ఈ రెండు స్టెప్స్ ను ఫాలో అయితే స్పాకి వెళ్లక్కర్లేదు.ఇంట్లోనే జుట్టు కుదుళ్లు మరియు మూలాలు ఆరోగ్యంగా బలంగా మార‌తాయి.స్కాల్ప్‌ లోతుగా శుభ్రం అవుతుంది.

జుట్టు షైనీగా మ‌రియు స్మూత్ గా సైతం మెరుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube