దర్శకునిగా, రచయితగా, నిర్మాతగా, పొలిటీషియన్ గా దాసరి నారాయణరావు పాపులారిటీని సొంతం చేసుకున్నారనే సంగతి తెలిసిందే.నిర్మాతగా కూడా దాసరి నారాయణరావు ఎన్నో విజయాలను ఖాతాలో వేసుకున్నారు.
ఇండస్ట్రీకి సంబంధించిన ఎన్నో సమస్యలను దాసరి నారాయణరావు పరిష్కరించడం గమనార్హం.సూరిగాడు, మామగారు, ఒసేయ్ రాములమ్మ సినిమాలు దాసరిలోని గొప్ప నటులను ప్రేక్షకులకు తెలిసేలా చేశాయి.
జేడీ చక్రవర్తి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో నియంత అనే సినిమా కొరకు ఏర్పాట్లు జరుగుతున్నాయని రాజశేఖర్, వినోద్ కుమార్ ను ముందుగా అనుకున్నారని ఆ తర్వాత నేను చేస్తానని చెప్పి ఒకరోజు ముందు మానేశానని జేడీ చక్రవర్తి తెలిపారు.తాను ఎందుకు రావడం లేదనే ప్రశ్నకు క్షణక్షణం సినిమాలో రౌడీకి డూప్ గా చేస్తున్నానని చెప్పానని చక్రవర్తి చెప్పుకొచ్చారు.
ఆ తర్వాత దాసరి నారాయణరావు గారి ఆఫీస్ నుంచి వరుసగా కాల్స్ వచ్చాయని జేడీ చక్రవర్తి అన్నారు.దాసరి నారాయణరావు గారు రామ్ గోపాల్ వర్మకు ఫోన్ చేసి నీ దగ్గర ఉండే గడ్డం కుర్రాడు షూటింగ్ కు రానని చెప్పాడని వాడికి పిచ్చా? అని అడిగారని జేడీ చక్రవర్తి తెలిపారు.ఆ తర్వాత ఇండస్ట్రీలో ఉండాలని అనుకుంటున్నాడా? లేదా అని దాసరి నారాయణరావు అన్నారని జేడీ చక్రవర్తి చెప్పుకొచ్చారు.
అయితే వర్మ జేడీ చక్రవర్తి తన షూటింగ్ కు రాడని మీ షూటింగ్ కు వస్తాడో లేదో అతని ఇష్టమని వర్మ దాసరితో చెప్పారని జేడీ చక్రవర్తి తెలిపారు.దాసరితో పాటు వాళ్లను ఇబ్బంది పెట్టినందుకు కొందరికి పార్టీ కూడా ఇచ్చానని జేడీ చక్రవర్తి చెప్పుకొచ్చారు.దాసరి నారాయణరావును కావాలనే ఇబ్బంది పెట్టానని జేడీ చక్రవర్తి చెప్పకనే చెప్పేశారు.
జేడీ చక్రవర్తికి ప్రస్తుతం ఎక్కువగా అవకాశాలు రావడం లేదనే సంగతి తెలిసిందే.